జాతీయ వార్తలు

మారుతున్న జార్ఖండ్ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లతిహార్ (జార్ఖండ్), నవంబర్ 13: సౌర విద్యుత్‌తో పనిచేసే సరికొత్త సెల్ టవర్ల ఏర్పాటుతో జార్ఖండ్‌లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాల స్వరూపం మారిపోతోంది. నక్సలైట్ల ప్రభావాన్ని తగ్గించడంతోపాటు భద్రతా బలగాలకు, స్థానిక గిరిజనులకు సాధికారత చేకూర్చేందుకు ఈ టవర్లు దోహదపడుతున్నాయి. కేవలం భద్రతా బలగాల కదలికలు మెరుగుపడేందుకే కాకుండా గిరిజన ప్రాంతాల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్న నక్సలైట్లను మరింత సమర్థవంతంగా ప్రతిఘటించేందుకు ఈ టవర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. గతంలో నక్సలైట్లు సెల్ టవర్లను కూల్చివేయడమో లేక వాటికి విద్యుత్ సరఫరాను నిలిపివేయడమో చేసేవారు. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ ఆధారిత సెల్ టవర్లకు సాయుధ బలగాలు నిరంతరం భద్రత కల్పిస్తున్నాయని సిఆర్‌పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మత్లాంగ్ కృష్ణ చౌబే తెలిపారు.