జాతీయ వార్తలు

సాంకేతిక సమస్యతో వెనుదిరిగిన విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, నవంబర్ 13: రేణిగుంటకు రావాల్సిన స్పైస్ జెట్ విమానం సాంకేతిక సమస్యతో వెనుదిరిగిన సంఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. హైదరాబాద్ షంషాబాద్ విమానాశ్రయం నుంచి 40 మంది ప్రయాణికులతో ఉదయం 9 గంటలకు బయలుదేరిన స్పైస్ జెట్ విమానం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే టేకాఫ్ అయిన విమానానికి అరగంట అనంతరం సాంకేతిక సమస్య తలెత్తడంతో స్పైస్‌జెట్ పైలెట్ సమస్యను గుర్తించి రేణిగుంట విమానాశ్రయంలో విమానాన్ని ల్యాడింగ్ చేయలేమని నిర్థారించిన అనంతరం ఆ విమానాన్ని తిరిగి హైదరాబాద్ విమానాశ్రయానికి తరలించారు. మరొక స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణికులను మధ్యాహ్నం 12.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేర్చారు.