జాతీయ వార్తలు

‘గాలి’ పెళ్లి విందుకు బిజెపి నేతలు దూరం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, నవంబర్ 15: పెద్దనోట్ల రద్దు తర్వాత తాము దాచుకున్న డబ్బును డిపాజిట్ చేయాలన్నా, మార్చుకోవాలన్నా జనం నానాయాతనలు పడుతున్న నేపథ్యంలో బుధవారం బెంగళూరులో అట్టహాసంగా జరగబోయే మైనింగ్ కింగ్, బిజెపి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె వివాహానికి కర్నాటకకు చెందిన పలువురు బిజెపి నేతలు దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అధికారికంగా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదుకానీ, ఇలాంటి సమయంలో ఆర్భాటంగా జరిగే ఇలాంటి వివాహాలకు దూరంగా ఉండడమే మంచిదని పార్టీ సలహా ఇచ్చిందని బిజెపికి చెందిన సీనియర్ నాయకుడొకరు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. అయితే రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్పలాంటి కొంతమంది ముఖ్యనేతలు మాత్రం ఈ వివాహానికి హాజరవుతారని మరో నాయకుడు చెప్పినట్లు ఆ పత్రిక తెలిపింది.
బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న ఈ వివాహానికి వందకోట్లకు పైగానే ఖర్చు చేయనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయనే దానిపై ఆదాయం పన్ను విభాగం ఓ కనే్నసి ఉంచినట్లు తెలుస్తోంది. ఈ వివాహంకోసం ప్యాలెస్ గ్రౌండ్స్‌లో విజయనగరం సామ్రాజ్యం కాలం నాటి ఒక సెట్టింగ్‌నే ఏర్పాటు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం కోసం రూపొందించిన ఖరీదయిన ఆహ్వానపత్రిక గత నెల సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివాహ ఆహ్వాన పత్రికలను ఎల్‌సిడి స్క్రీన్‌లున్న బాక్స్‌లలో గాలి జనార్ధన్ రెడ్డి ఆహ్వానితులకు పంపించారు. ఈ బాక్స్‌ను తెరవగానే నూతన వధూవరులతో పాటుగా తమ కుమార్తె వివాహానికి గాలి దంపతులు ఆహ్వానిస్తున్నట్లుగా ఉండే ఒక మ్యూజిక్ వీడియో ఆటోమేటిక్‌గా ప్లే అయ్యే విధంగా ఆ బాక్స్‌లను రూపొందించారు.

చిత్రం.. బెంగళూరులోని ప్యాలెస్ గ్రౌండ్స్‌