జాతీయ వార్తలు

టోల్ నష్టం భర్తీకి ఎన్‌హెచ్‌ఏఐ యోచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 15: పెద్ద నోట్ల రద్దు కారణంగా టోల్ గేట్ల వద్ద వాహనాల రద్దీని తగ్గించడానికి ఈ నెల 18 దాకా టోల్‌టాక్స్ వసూళ్లను నిలిపివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం కారణంగా టోల్ వసూలు చేసే వారికి కలిగే నష్టంలో 75 శాతం దాకా భర్తీ చేయాలనే ఒక ప్రతిపాదనను జాతీయ హైవేల అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఐఏ) ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత వారం ప్రధాని నరేంద్ర మోదీ వెయ్యి, అయిదు వందల రూపాయలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వాహనాల ట్రాఫిక్ సాఫీగా జరిగిపోయేందుకు వీలుగా అన్ని టోల్ ప్లాజాల వద్ద టోల్ వసూలును నిలిపివేయాలని దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ఆపరేటర్లను కేంద్ర రోడ్లు, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించడం తెలిసిందే. ‘దేశవ్యాప్తంగా సగటున రోజుకు టోల్ వసూళ్లు 60-75 కోట్ల వరకు ఉంటుంది. అంటే వీరికి ఎదురయ్యే నష్టం కూడా ఆ మేరకు ఉంటుంది. వారికి నగదు ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ నష్టంలో 75 శాతం దాకా చెల్లించడం ద్వారా ఈ నష్టాన్ని తాత్కాలికంగా భర్తీ చేస్తాం’ అని ఎన్‌హెచ్‌ఏఐ చైర్మన్ రాఘవ్ చంద్ర మంగళవారం అసోచామ్ ఏర్పాటు చేసిన ఒక సదస్సు నేపథ్యంలో విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. టోల్ ప్లాజాల్లో కొన్ని ప్రభుత్వ అధీనంలోవి కాగా, మిగతావి ప్రైవేట్ టోల్స్ అని ఆయన చెప్పారు. ప్రభుత్వ అధీనంలోని వంద టోల్‌ప్లాజాలను కూడా ప్రైవేట్ ఆపరేటర్లకు కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, అందువల్ల టోల్ వసూలు రద్దు నిర్ణయం కారణంగా ఈ టోల్ ప్లాజాలు సైతం నగదు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండడానికి వీటికి కూడా పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆమోదంకోసం ఎన్‌హెచ్‌ఏఐ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచినట్లు కూడా చంద్ర చెప్పారు.