జాతీయ వార్తలు

ప్రధాని తల్లయనా క్యూలోనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహమ్మదాబాద్, నవంబర్ 15: కరెన్సీ మార్పిడి దగ్గర సామాన్యులు, విఐపిలు అన్న ప్రశే్న లేదు. ఇక్కడ ఎవరైనా క్యూలో నిలుచోవలసిందే. 94 సంవత్సరాల వయసున్న మోదీ తల్లి హీరాబెన్ బ్యాంకుకు వచ్చి క్యూలో నిలుచుని తన దగ్గరున్న పాత నోట్లను మార్చుకున్నారు. గాంధీనగర్‌లోని ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు మంగళవారం ఉదయం తొమ్మిది రూ.500నోట్లను తీసుకుని వచ్చారు. బ్యాంకు సిబ్బంది రెండు 2వేల రూపాయల నోట్లు, ఐదు 100రూపాయల నోట్లను హీరాబెన్‌కు అందించారు. హీరాబెన్ గాంధీనగర్‌లో మోదీ సోదరుడు పంకజ్ మోదీ దగ్గర ఉంటున్నారు. ఆయన గుజరాత్ సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. హీరాబెన్ ఆయన ప్రధాని అయిన రెండేళ్ల తరువాత గత మే నెలలో ఢిల్లీకి వచ్చి కొంతకాలం కొడుకు దగ్గర గడిపారు.

చిత్రం.. గాంధీనగర్‌లోని ఓ బ్యాంకులో మంగళవారం పాత 500 నోట్లను మార్చుకున్న అనంతరం
కొత్త 2వేల నోటును చూపిస్తున్న ప్రధాని మోదీ తల్లి హీరాబెన్