జాతీయ వార్తలు

రక్షణ బంధం.. మరింత విస్తృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: ఇప్పటికే సన్నిహితమైన తమ రక్షణ సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాలని, అలాగే హింసాత్మక కార్యకలాపాల వైపు జనాన్ని మళ్లించడం, ఉగ్రవాద కార్యకలాపాలను ఎదుర్కోవడంలో సహకారాన్ని మరింత తీవ్రం చేయాలని భారత్, ఇజ్రాయెల్ దేశాలు మంగళవారం నిర్ణయించాయి. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపైన, వాటిని ప్రోత్సహించే ప్రభుత్వాలపైన కఠినంగా వ్యవహరించాలని కూడా ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చాయి. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, జల వనరులు, సైబర్ నేరాలులాంటి వివిధ రంగాల్లో తమ సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కూడా భారత్‌లో తొలిసారి పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్, ప్రధాని నరేంద్ర మోదీ మధ్య మంగళవారం జరిగిన విస్తృత చర్చల సందర్భంగా ఇరు దేశాలు అంగీకరించాయి. ఉగ్రవాదం ఒక అంతర్జాతీయ ముప్పని, దీనికి ఎల్లలు లేవని, ఇతర వ్యవస్థీకృత నేరాలతో దీనికి విస్తృతమైన సంబంధాలున్నాయనే విషయాన్ని తాము గుర్తించామని మోదీ ఆ ప్రకటనలో తెలిపారు. విచారకరమైన విషయమేమిటంటే దీని మూలాలున్న, వ్యాప్తి చెందడానికి కారణమైన ఒక దేశం భారత దేశం పొరుగునే ఉందని పరోక్షంగా పాక్‌నుద్దేశించి మోదీ అన్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లపైన, వాటిని ప్రోత్సహించే దేశాలపైన ప్రపంచ దేశాలు కృతనిశ్చయంతో కఠిన చర్యలు తీసుకోవాలని, అలా చేయని పక్షంలో లేదా వౌనంగా ఉండినా అది ఉగ్రవాదులను ప్రోత్సహించడమే అవుతుందనే విషయాన్ని ఇరు దేశాలు గుర్తించాయని మోదీ అన్నారు. రివ్లిన్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలనే ఆలోచనకు కొత్త ఊపును ఇచ్చిందని, రక్షణ రంగంలో భాగస్వామ్యం పెరుగుతుండడం దీనికి ఓ ఉదాహరణ అని ఇరుపక్షాలు అభిప్రాయపడ్డాయని అన్నారు. ఉత్పత్తి, ఉత్పాదకత భాగస్వామ్యాల ద్వారా దీన్ని మరింత విస్తృతం చేసుకోవాలని భావించినట్లు చెప్పారు. వ్యవసాయం, జలవనరుల నిర్వహణ రంగాలకు సంబంధించి రెండు ఒప్పందాలపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. రెండు దేశాల మధ్య ముఖ్యంగా సైనిక రంగంలో సహకారం పెరుగుతున్న విషయాన్ని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ప్రస్తావిస్తూ భారత్‌లో తయారీకి, భారత్‌తో కలిసి తయారీకి (మేక్ ఇన్‌ఇండియా, మేక్ విత్ ఇండియా)కు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు.

చిత్రం.. ఢిల్లీలో మంగళవారం సంయుక్త విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఇజ్రాయెల్
అధ్యక్షుడు ర్యూవెన్ రివ్లిన్, ప్రధాని నరేంద్ర మోదీ