జాతీయ వార్తలు

వారం గడిచినా అదే వరస!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి వారం రోజులు గడిచిపోయినప్పటికీ సామాన్యుడి కరెన్సీ కష్టాలు తగ్గలేదు. వాస్తవానికి ఒక రోజు సెలవు తర్వాత మంగళవారం బ్యాంకులు తెరచుకొన్నప్పుడు వాటి ముందు నగదుకోసం వేల సంఖ్యలో జనం క్యూలు కట్టి ఉండడం చూస్తే ఈ కష్టలు మరింతగా పెరిగాయనే చెప్పాలి. అటు కోల్‌కతానుంచి ఇటు ముంబయి వరకు, ఢిల్లీ నుంచి చెన్నై వరకు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. చిల్లర నోట్లు దొరక్క పోవడంతో కూరగాయలులాంటి వాటిని కొనుగోలు చేయడం కూడా వాయిదా వేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి కష్టాలకు అంతు లేకపోయింది.
దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారే సమయానికే బ్యాంకులు, ఎటిఎంల ముందు కొండవీటి చాంతాడంత క్యూలు కనిపించాయి. అయితే చాలా ఎటిఎంలలో నగదు కొన్ని గంటల్లోనే అయి పోవడంతో జనం నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఆర్‌బిఐ ప్రధాన కార్యాలయంలాంటి కొన్నిచోట్ల గొడవలకు దిగిన జనంపై పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఆర్థిక రాజధాని ముంబయిలో బ్యాంకులు తెరుచుకోగానే అప్పటికే గంటల కొద్దీ బ్యాంకుల ముందు వేచి ఉన్న జనం ఒక్కసారిగా లోపలికి వెళ్లడానికి ఎగబడ్డంతో అనేకచోట్ల తోపులాటలు చోటు చేసకున్నాయి. పరిస్థితిని సమీక్షించిన మహారాష్ట్ర మంత్రివర్గం నోట్ల రద్దు కారణంగా జనాలు పడుతున్న కష్టాలను తగ్గించడానికి తగిన సిఫార్సులు చేయడం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది కూడా.
తమిళనాడు, కేరళ రాష్ట్రాలలోనూ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. మార్కెట్లు వెలవెలబోతూ ఉంటే బ్యాంకులు, ఎటిఎంల ముందు జనం రోజంతా నగదు కోసం పడిగాపులు పడ్తూనే ఉన్నారు. చెన్నైలోని ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన కోయంబేడు కూరగాయల మార్కెట్‌కు దక్షిణాది రాష్ట్రాలనుంచి ప్రతి రోజూ 500కు పైగా లారీల కూరగాయలు వచ్చేవి. అయితే ఇప్పుడు చిల్లర వ్యాపారులు, ఇతర కస్టమర్లు లేక మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్, కర్నాటక లాంటి కొన్ని రాష్ట్రాల్లో పాత నోట్లు మార్చుకోవడానికి, ఎటిఎంలలో డబ్బులు తీసుకోవడానికి జనం పెద్ద ఎత్తున చేరడంతో కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పరిస్థితిని సమీయించింది. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తూ, ఏదయినా హింస చెలరేగే పరిస్థితి ఉంటే వెంటనే కేంద్రానికి సమాచారం ఇవ్వాలని హోం శాఖ అన్ని రాష్ట్రాల డిజిపిలను కోరింది. మరో మూడు నాలుగు రోజుల్లో పరిస్థితి మామూలవుతుందని కూడా ఆ శాఖ భావిస్తోంది. సామాన్యులు కరెన్సీ కష్టాలను తగ్గించడానికి రిజర్వ్ బ్యాంక్ మొబైల్ ఎటిఎంలను రంగంలోకి దించడంతో పాటుగా పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.

చిత్రాలు..నగదు మార్పిడి కోసం గుర్‌గావ్‌లో ఒక బ్యాంకు వద్ద క్యూలో నిలబడ్డ జనం
సరకు రవాణా తగ్గిపోవడంతో మంగళవారం నవీముంబయలోని
ఎపిఎంసి టెర్మినల్‌లో నిలిచిపోయన ట్రక్కులు