జాతీయ వార్తలు

స్వల్పంగా తగ్గిన పెట్రో ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: మంగళవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చేలా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలుపై రూ.1.46పైసలు, డీజిల్‌పై 1.53పైసలు తగ్గించినట్టు చమురు కంపెనీలు ప్రకటించాయి. వ్యాట్‌తో సంబంధం లేకుండా ఈ రేట్లను తగ్గించడం వల్ల వాస్తవంగా పెట్రోలు, డీజిల్ ధరలు ఎక్కువగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ నుంచి వరుసగా ఆరుసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో తాజా తగ్గింపు వాహనదారులకు కొంత మేర ఉపశమనం కలిగించేదే. రేట్లను వరుసగా పెంచడం వల్ల కేవలం రెండు నెలల వ్యవధిలో పెట్రోలు ధర ఏడు రూపాయలు, మూడు సార్లు పెంచడం వల్ల డీజిల్ రేటు లీటరుకు రూ.3.90పైసలు పెరిగాయి.