జాతీయ వార్తలు

మాటంటే మాటే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని అదుపు చేసేందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశంలో మరోసారి స్పష్టం చేశారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా కొనసాగేలా అందరూ సహకరించాలని కోరేందుకు మోదీ మంగళవారం సాయంత్రం పార్లమెంటు ఆవరణలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. పెద్ద నోట్లను రద్దు నిర్ణయాన్ని సమర్ధించి దేశాభివృద్ధికి తోడ్పడాలని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) చట్టం రూపకల్పనకు సహకరించినట్లే నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు సహకరించాలని ఆయన ప్రతిపక్షాలను కోరారు. రాజకీయాల్లో నల్ల ధనం ప్రభావాన్ని తగ్గించేందుకు అన్ని రాజకీయ పార్టీలు కలిసి పని చేయాలని మోదీ పిలుపు ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దుతోపాటు ప్రతిపక్షం లేవనెత్తే అన్ని అంశాలపై పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధాని తెలిపారు. పార్లమెంటు, శాసన సభల ఎన్నికలు ఒకేసారి జరపటం గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని సూచించారు. దేశంతో పాటు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పార్లమెంటులో అన్ని అంశాలపై చర్చ జరపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టి సీమాంతర ఉగ్రవాదాన్ని అదపు చేసేందుకు విపక్షాలు తనకు పార్లమెంటు లోపల, వెలుపల సహకారం అందజేయాలని కోరారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు అందుతున్న విరాళాలపై లోతుగా చర్చ జరిపి సమస్యలకు పరిష్కారాలను కనుగొనాల్సిన బాధ్యత అందరిపై ఉందని మోదీ స్పష్టం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, ప్రతిపక్ష నాయకులు మల్లిఖార్జున ఖర్గే, గులాం నబీ ఆజాద్‌లతో పాటు శరద్ యాదవ్ జెడి(యు), డి.రాజా (సిపిఐ), మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి (వైకాపా), కె.కేశవరావు, జితేందర్ రెడ్డి (తెరాస), తోట నరసింహం, దేవేందర్ గౌడ్ (టిడిపి), సుదీప్ భందోపాధ్యాయ (తృణమూల్ కాంగ్రెస్), నవనీత్ కృష్ణన్ (డిఎంకె) తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పెద్ద నోట్ల రద్దు కుంభకోణం
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం ఒక పెద్ద కుంభకోణమని కాంగ్రెస్ నాయకులు మల్లిఖార్జన ఖర్గే, గులాం నబీ ఆజాద్ ఆరోపించారు. ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను పార్లమెంటులో వెల్లడిస్తామని వారు చెప్పారు. పెద్ద నోట్ల రద్దును ఉపసంహరించుకోవాలని తృణమూల్ కాంగ్రెస్ ఈ సమావేశంలో డిమాండ్ చేయగా, ఈ నిర్ణయం వలన ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు జమ్ము-కాశ్మీర్, న్యాయ నియామకాలకు సంబంధించిన సమస్యల గురించి కాంగ్రెస్ తదితర పార్టీలు ప్రస్తావించాయి. నల్లధనాన్ని, అవినీతిని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని, అయితే వీటిని నిర్మూలించే ప్రక్రియలో ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించటంరో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్, వామపక్షాలు దుయ్యబట్టాయి. విదేశీ బ్యాంకుల్లో ఉన్న నల్ల ధనాన్ని స్వదేశానికి తీసుకురావటంలో మోదీ ఘోరంగా విఫలమయ్యారని కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించగా, పెద్ద నోట్ల రద్దు వలన సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాజ్యసభ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ దుయ్యబట్టారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం గురించి కొందరు బిజెపి నాయకులకు ముందే తెలిసిందని, దీనిపై దర్యాప్తు జరిపించడంతో పాటు పార్లమెంటులో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్ తదితర ఐదు రాష్ట్రాల శాసన సభల ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని దెబ్బ తీసేందుకే ఎన్‌డిఎ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిందని కాంగ్రెస్ తదితర పార్టీలు ఆరోపించాయి. అయితే పెద్దనోట్ల రద్దును ఉపసంహరించుకోవాలని తాము డిమాండ్ చేయటం లేదని ఆజాద్ స్పష్టం చేశారు.