జాతీయ వార్తలు

పెద్ద నోట్ల రద్దుపై నిరసనల వెల్లువ ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, నవంబర్ 18: పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి శుక్రవారం మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ ప్రజలు ఏవిధంగా జీవించాలో మోదీ నిర్ణయించలేరని ఆయన స్పష్టం చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజలే సర్వోన్నతులని ఏచూరి పేర్కొంటూ, ఏమాత్రం ఆమోదయోగ్యం కానీ మోదీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతమవడం ఖాయమని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కేరళ రాజధానిలో శుక్రవారం అధికార వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్) నిర్వహించిన ధర్నాలో ఏచూరి ప్రసంగిస్తూ, ‘ప్రజలతోనే మన రాజ్యాంగం ప్రారంభమవుతుంది. ప్రజలు ఎలా జీవించాలో ప్రధాని నిర్ణయించలేరు. పెద్ద నోట్లను రద్దుచేస్తూ మోదీ చేపట్టిన చర్య ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. దీనికి వ్యితిరేకంగా నిరసనలు వెల్లువెత్తడం ఖాయం’ అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వాలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు.