జాతీయ వార్తలు

పాత రూ.500 నోట్లను అనుమతించాలి : మమత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, నవంబర్ 18: కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘చర్యలు లేని ప్రకటనలు’ చేస్తోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ శుక్రవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పెద్ద నోట్ల రద్దుతో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు ఊరట కలిగించేందుకు కొత్త నోట్లతో పాటు పాత 500 రూపాయల నోట్ల చెలామణిని కొనసాగించేందుకు అనుమతించాలని ఆమె కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘సమస్యకు పరిష్కారం లభిస్తుందని మేము ఎదురు చూస్తున్నాం. సాధారణ పరిస్థితిని పునరుద్ధరించి, పెద్ద నోట్ల రద్దుతో ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ ఊరట కలిగించేందుకు దోహదపడే కొన్ని సూచనలు మా వద్ద ఉన్నాయి. కొత్త నోట్లతో పాటు పాత 500 రూపాయల నోట్ల చెలామణిని కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించాలి. అలాగే ప్రజలకు 100, 50, 10 రూపాయల నోట్లు సులభంగా అందుబాటులో ఉండేలా చూడాలి. డిసెంబర్ 30వ తేదీ నాటికి నగదు చెలామణి మెరుగుపడితే ఆ తర్వాత 1000 రూపాయల నోట్లను ఉపసంహరించుకోవచ్చు’ అని మమతా బెనర్జీ ఒక ప్రకటనలో కేంద్ర ప్రభుత్వానికి సూచించారు.