జాతీయ వార్తలు

కొత్తనోట్లపై దేవనాగరి లిపి.. రాజ్యాంగ విరుద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: కొత్త 2 వేల రూపాయలు, 500 రూపాయల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు బినయ్ విశ్వమ్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ నోట్ల డిజైన్‌లో దేవనాగరి లిపిని ఉపయోగించడం అధికార భాషలకు సంబంధించిన రాజ్యాంగంలోని 343(ఎ) అధికరణానికి విరుద్ధమని పేర్కొంటూ ఆయన శుక్రవారం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలయిన మిగతా పిటిషన్లతో కలిపి ఈ నెల 25న ఈ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు విచారిస్తుంది. బ్యాంక్ నోటు అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు చిహ్నమని, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి ముందు రాజ్యాంగ సభలో దీనిపై చర్చలు సైతం జరిగాయని, ఈ చర్చల అనంతరం బ్యాంకు నోటుపై ఉపయోగించే భాషలు సంఖ్యాపరంగా గుర్తించిన అంతర్జాతీయ భాషలతో సమానంగా ఉండాలని నిర్ణయించడం జరిగిందని, అందువల్లనే రాజ్యాంగంలోని అధికరణను ఇప్పుడున్న విధంగా రూపొందించడం జరిగిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు 2వేల రూపాయలు, 500 రూపాయల కొత్త నోట్లలో తేమ తగిలినప్పుడు రంగు పోవడం, చాలా దేశాల కరెన్సీని పోలి ఉండడం లాంటి లోపాలు చాలా ఉన్నాయని కూడా ఆయన ఆ పిటిషన్‌లో ఆరోపించారు. ప్రధానంగా తన అభ్యంతరం అధికార భాషలకు సంబంధించేనని స్పష్టం చేశారు. 1960 నాటి అధికార భాషల చట్టంలో కరెన్సీ నోట్లపై ఉపయోగించే భాషలకు సంబంధించి ఎలాంటి మార్పులకు అవకాశం లేదని కూడా ఆయన ఆ పిటిషన్‌లో వాదించారు.