జాతీయ వార్తలు

రూ.20 వేలకు 15 కిలోల నాణేల మూట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్లను రద్దుచేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జనానికి రకరకాల కష్టాలు ఎదురవుతున్నట్లు మీడియా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో ఇంతియాజ్ ఆలమ్ అనే ఉద్యోగికి కూడా అలాంటి కష్టమే ఎదురయింది. అత్యవసరంగా డబ్బు అవసరమై బ్యాంక్ క్యూలో నిలబడిన తర్వాత బైటికి వచ్చిన ఆయనకు మోయలేని భారం కొత్తగా వచ్చిపడింది. పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ అయిన ఇంతియాజ్ అత్యవసరంగా డబ్బు అవసరమై పాత 500, వెయ్యి రూపాయల నోట్లను మార్చుకోవడానికి శుక్రవారంనాడు ఢిల్లీలో తనకు ఖాతా ఉన్న జామియా కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద నాలుగు గంటల సేపు క్యూ లైన్లో నిలబడ్డాడు. చివరికి తన వంతు వచ్చాక తనకు 20 వేల రూపాయలు కావాలని బ్యాంక్ మేనేజర్‌ను అడిగాడు. అయితే బ్యాంక్‌లో డబ్బులు లేవని, 2వేల రూపాయలయితే ఇస్తామని మేనేజర్ చెప్పారు. అయితే తనకు ఎక్కువ సొమ్ము ఎందుకు కావాలో చెప్పిన తర్వాత బ్యాంక్ మేనేజర్ అంతమొత్తం ఇవ్వడానికి అంగీకరించారు. అయితే పది రూపాయల నాణేలు ఇస్తానని షరతు పెట్టారు. చేసేది ఏమీ లేక ఇంతియాజ్ దానికి అంగీకరించాడు. అంత బరువుండే సంచీ ఎలా తీసుకెళ్లాలని కాస్త ఆందోళన చెందినప్పటికీ అదికూడా నగదే అయినందున తాను అందుకు ఒప్పుకున్నానని ఇంతియాజ్ చెప్పాడు. ఆ నాణేలు మొత్తం తూకం వేస్తే 15 కెజిల బరువుంటుందట. అయితే ఆ నాణేలు తీసుకువచ్చిన ఇంతియాజ్ కొంతమందికి 2వేల రూపాయల నోట్లకు చిల్లర రూపంలో కొంత భారం వదిలించుకోగా, రెస్టారెంట్ బిల్లులు, క్యాబ్‌చార్జీలు చెల్లించి మరికొంత దించుకున్నాడు.

చిత్రం.. బ్యాంక్ నుంచి తెచ్చుకున్న నాణేలను లెక్కించి ప్యాక్ చేసుకుంటున్న ఇంతియాజ్ ఆలమ్