జాతీయ వార్తలు

అసోంలో పేలుడు: ముగ్గురు జవాన్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, నవంబర్ 19: అసోంలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఎగువ అసోంలో తిన్‌సుకియా జిల్లా పెన్‌గెరి వద్ద ఆర్మీ వాహనం లక్ష్యంగా శనివారం ఉల్ఫా ఉగ్రవాదులు, ఎన్‌ఎస్‌సిఎన్(కె) ఉగ్రవాదులు సంయుక్తంగా జరిపిన పేలుడులో కనీసం ముగ్గురు ఆర్మీ జవాన్లు మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
15 మంది ఉగ్రవాదుల ముఠా ఒకటి శనివారం ఉదయం దాడి చేసి రెండు ఆర్మీ వాహనాలను ధ్వంసం చేయగా, సంఘటన స్థలంలో ఒకరు చనిపోగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తూ ఉండగా దారిలో చనిపోయారని ఆయన చెప్పారు. ఉల్ఫా(కె), ఎన్‌ఎస్‌సిఎన్(కె) ఉగ్రవాదులు సంయుక్తంగా ఈ దాడి చేశారని, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లు (ఆర్‌పిజి), ఎకె-47 రైఫిళ్లు, మోర్టార్లులాంటి అత్యధునాతన ఆయుధాలు వారివద్ద ఉన్నాయని తిన్‌సుకియా జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ముగ్ధజ్యోతి మహంత చెప్పారు. సైన్యం ఎదురు కాల్పులు జరిపిందని, అయితే మిలిటెంట్లు తప్పించుకుని పారిపోయారని, మిలిటెంట్లలో ఎవరైనా చనిపోయారో, గాయపడ్డారో ఇంకా తెలియరాలేదని తెలిపారు. దాడి జరిగిన ప్రాంతంలో పెద్ద గొయ్యి పడిందని, రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమైనాయని ఎస్పీ చెప్పారు.
మిలిటెంట్ల కోసం పెద్ద ఎత్తున గాలింపు జరుగుతోందని, పోలీసులు, సిఆర్‌పిఎఫ్ జవాన్లు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారని, హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించినట్లు చెప్పారు. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసోం ముఖ్యమంత్రి సర్బనంద సోనోవాల్‌కు ఫోన్ చేసి పరిస్థితిపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ, సంఘటన స్థలానికి వెళ్లాల్సిందిగా డిజిపి ముకేశ్ సహాయ్‌ని ఆదేశించారు.

చిత్రం.. పేలుడుతో ధ్వంసమైన ట్రక్కును పరిశీలిస్తున్న అసోం డిజిపి ముకేశ్ సహాయ్