జాతీయ వార్తలు

రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్దనోట్ల రద్దుపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతూనే ఉంది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ 500, 1000 రూపాయల నోట్ల రద్దు సాహసోపేతమైన చర్యగా అభివర్ణించగా, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన రాజ్‌నాథ్ పెద్ద కరెన్సీ రద్దు రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన అవుతుందని స్పష్టం చేశారు. తాత్కాలికంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలిగించినా దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అవినీతి, నల్లధనం కట్టడికి మోదీ తీసుకున్న నిర్ణయం దోహదపడుతుందని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా దేశంలో ధనికులు, పేదల మధ్య వ్యత్యాసం తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం పీచమణచేందుకే కేంద్రం పెద్దనోట్లను రద్దుచేసిందని ఆయన పునరుద్ఘాటించారు. ఆర్థిక నిపుణులతో సంప్రదించకుండా మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా పెద్దకరెన్సీను రద్దుచేసిందని మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం ధ్వజమెత్తారు. కేంద్ర నిర్ణయం దేశ ప్రజలందరినీ ఇక్కట్లపాలు చేసిందని ఆరోపించారు. శనివారం ముంబయిలో ఓ కార్యక్రమంలో మాట్లాడిని చిదంబరం దీనివల్ల ఉత్పత్తిరంగం తీవ్రంగా దెబ్బతింటుందని, ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మోదీ సర్కార్ చెబుతున్నట్టు నల్లధనం బయటకు రాకపోగా పరిశ్రమలు మూతపడే అవకాశం ఉందని అన్నారు. త్రిపుర, సూరత్‌లలో లేఆఫ్‌లు, ఉద్యోగుల తొలగింపుమొదలైందని ఆయన వెల్లడించారు. ‘రోజువారీ అవసరాలు తీర్చుకునేందుకు ప్రజలవద్ద సొమ్ముల్లేవు. ఎరువులు కొనుగోలుకు రైతుల వద్ద పైకం లేదు. కూలీ డబ్బులు చెల్లించేందుకు చేతిలో నగదు లేదు’ అని సీనియర్ కాంగ్రెస్ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దనోట్ల రద్దుపై విరుచుకుపడుతున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ తాజాగా కేంద్రంపై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ రాష్ట్రానికి కొత్త 500 రూపాయల నోట్లు ఇవ్వకుండా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌కు కొత్త 500 నోట్లు పంపిన కేంద్రం పశ్చిమబెంగాల్‌కు మొండిచేయి చూపించిందని విమర్శించారు. గ్రామీణ భారతం అస్తవ్యస్తమైందని, పల్లె ప్రజలు, రైతులు నగదులేక ఇబ్బందులు పడుతున్నారని మమత చెప్పారు. పెద్దనోట్ల రద్దుపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను తృణమూల్ అధినేత్రి స్వాగతించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన సమస్యలపై మాట్లాడేందుకు కోల్‌కతాలోని ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయానికి వచ్చిన మమత ఆర్‌బిఐ ఆర్‌డి రేఖా వారియర్‌తో చర్చించారు. సామాన్యుల ఇబ్బందులు తొలగించాలని, ఏటిఎంలో నగదు అందుబాటులో ఉంచాలని ఆమె కోరారు. తరువాత బుర్రాబజార్ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడి వ్యాపారులతో మాట్లాడారు.
మోదీ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండానే పెద్దనోట్లను రద్దుచేసిందని కర్నాటక సిఎం సిద్దరామయ్య ఆరోపించారు. నల్లధనాన్ని అరికట్టాలన్న కేంద్రం నిర్ణయం స్వాగతించేదేనని, 500, 1000 నోట్లు రద్దు వల్ల తలెత్తే సమస్యలను ఎలా అధిగమించాలన్న దానిపై మోదీ సర్కార్‌కు ముందు చూపులేదని ఆయన విమర్శించారు. మరోపక్క ఎన్‌డిఏ మిత్రపక్షమైన శివసేన పెద్దకరెన్సీ రద్దుపై కేంద్రాన్ని తప్పుపట్టింది. ఉరి సెర్జికల్ దాడిలో చనిపోయినవారికంటే పెద్ద కరెన్సీ రద్దు నేపథ్యంలో చనిపోయినవారే ఎక్కువని సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలను బిజెపి తప్పుపట్టడాన్ని సేన అధికార పత్రిక ‘సామ్నా’లో ఎద్దేవా చేసింది.

చిత్రాలు.. కోల్‌కతాలోని రిజర్వు బ్యాంకు వద్ద మమతా బెనర్జీ
ముంబయలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం.