జాతీయ వార్తలు

ఇందిరకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19: దివంగత ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ 99వ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆమెకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తదితరులు నివాళులు అర్పించారు. ప్రణబ్ ముఖర్జీ, అన్సారీ, సోనియాగాంధీ శనివారం ఉదయం ఇక్కడి సఫ్దర్ జంగ్ రోడ్డులో గల అప్పట్లో ఇందిరాగాంధీ నివసించిన బంగ్లాకు చేరుకొని నివాళులు అర్పించారు. ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రార్థనా సమావేశాన్ని నిర్వహించారు. ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో శనివారం తెల్లవారు జామున విడిగా నిర్వహించిన ఇందిరాగాంధీ జయంతి కార్యక్రమంలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్‌తోపాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉన్నత స్థాయి నాయకులు పాల్గొని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అప్పట్లో ఇందిరాగాంధీ ఇచ్చిన ఒక ఉపన్యాసాన్ని వినిపించారు. జాతీయ సమైక్యత, సమగ్రతల పరిరక్షణను, ఆడపిల్లల సంరక్షణను కొనసాగించే దిశగా నిర్వహించవలసిన బాధ్యతను ఈ ఉపన్యాసంలో ఇందిరాగాంధీ నొక్కిచెప్పారు. కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, అహ్మద్ పటేల్, మోతీలాల్ వోరా, ఆనంద్ శర్మ, రణదీప్ సుర్జేవాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. పార్లమెంటు సెంట్రల్ హాలులో నిర్వహించిన మరో కార్యక్రమంలో మన్మోహన్ సింగ్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, మాజీ ఉప ప్రధాని ఎల్‌కె అద్వానీ, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, టిఎంసి లోక్‌సభ సభ్యుడు సుదీప్ బంద్యోపాధ్యాయ్ తదితరులు ఇందిరాగాంధీకి ఘన నివాళులు అర్పించారు.

చిత్రం.. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 99వ జయంతి సందర్భంగా శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన
ఫోటో ప్రదర్శనను తిలకిస్తున్న రాష్టప్రతి ప్రణబ్. చిత్రంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ