జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, నవంబర్ 19: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపూర్ ఎస్పీ అభిషేక్ మీనా వెల్లడించిన వివరాలిలావున్నాయి. ఛోటా దొంగార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెచ్చకిలం గ్రామ అటవీ ప్రాంతంలో డిస్ట్రిక్ట్ రిజర్వు గ్రూప్, స్పెషల్ టాస్క్ఫోర్స్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. ఈ సమయంలో బలగాల రాకను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. అప్రమత్తమైన బలగాలు మావోయిస్టులపై ఎదురుకాల్పులకు దిగాయి. ఇరువర్గాల మధ్య రెండు గంటలపాటు హోరాహోరీ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందారని, వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ మీనా తెలిపారు. అలాగే సంఘటనా స్థలంలో 350 రైఫిల్ ఒకటి, 12బోర్ తుపాకులు 3 స్వాధీనం చేసుకున్నామన్నారు. సంఘటనా స్థలంలో ఉన్న రక్తం మరకలను బట్టి మరో అయిదుగురు మావోయిస్టులకు బుల్లెట్ గాయాలైనట్టు భావిస్తున్నామన్నారు.