జాతీయ వార్తలు

మోదీ నోట.. డిలాన్ పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు అనంతరం దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులను ప్రస్తావిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రఖ్యాత పాప్ గాయకుడు, నోబెల్ బహుమతి గ్రహీత బాబ్ డిలాన్ గళం నుంచి జాలువారిన ‘ది టైమ్స్ దే యార్ చేంజింగ్’ (కాలం మారుతోంది) అనే పాటలోని కొన్ని పంక్తులను ఉటంకించారు. ముంబయి శివార్లలోని సుందరమైన బంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో శనివారం గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌లో పాల్గొన్న వేలాది మంది ప్రజలను ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా ప్రసంగిస్తూ, 2014లో తనకు న్యూయార్క్ సెంట్రల్ పార్క్‌లో జరిగిన గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌లో పాల్గొనే అవకాశం లభించినందుకు ఎంతగానో సంతోషించానని, అయితే ఇప్పుడు బిజీ షెడ్యూలు కారణంగా తాను వ్యక్తిగతంగా ఈ ఉత్సవానికి రాలేకపోతున్నానని తెలిపారు. ‘బాబ్ డిలాన్, నోరా జోన్స్, క్రిస్ మార్టిన్, ఎఆర్.రహ్మాన్ లాంటి సంగీత స్రష్టలను మీరు ఎంతగానో అభిమానిస్తున్నట్లుగానే నేను అభిమానించే వారు కూడా కొంత మంది ఉన్నారు. 1960వ దశకంలో బాబ్ డిలాన్ గళం నుంచి జాలువారిన పాట సామాజిక మార్పునకు పర్యాయ గీతంగా నిలిచింది. ఎంతో అర్థవంతమైన ఆ పాట ప్రస్తుతం భారత్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు సరిగ్గా అతికినట్లు సరిపోతుంది’ అని మోదీ పేర్కొన్నారు. ఇదిలావుంటే, గ్లోబల్ సిటిజన్ ఫెస్టివల్‌ను ఉద్దేశించి ప్రసంగించేందుకు మోదీకి తీరిక దొరికింది గానీ, పెద్ద నోట్ల రద్దు వలన ప్రజలు పడుతున్న పాట్ల గురించి పార్లమెంట్‌లో సమాధానమిచ్చేందుకు తీరిక దొరకడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది.