జాతీయ వార్తలు

భావనపాడు రేవు నిర్మాణాన్ని ప్రైవేట్‌కు అప్పగించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 19:శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణాన్ని పిపిపి పద్ధతిలో చేపట్టవద్దని కోరుతూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గత సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ నాడు కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నిర్మాణం శంకుస్థాపన సమావేశంలో మాట్లాడుతూ భావనపాడు ఓడరేవు నిర్మాణాన్ని ప్రైవేట్ రంగానికి అప్పగించకూడదని సూచించారని, కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులను ప్రైవేట్‌పరం చేయటం వలన ప్రభుత్వానికి ఎలాంటి లాభం రావటం లేదు కాబట్టి భావనపాడును ప్రైవేట్ రంగానికి ఇవ్వకూడదని చెప్పలేదా? అని ఆయన ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, మీ సమక్షంలోనే గడ్కరీ ఈ సూచన చేయలేదా? అని ఆయన ప్రశ్నించారు. భావనపాడు ఓడరేవును కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తే ఈ ఓడ రేవు ద్వారా వచ్చే ఆదాయం నుండి 25 నుండి 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని గడ్కరీ ప్రకటించలేదా? అని రామచంద్రరావు ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. గడ్కరీ చేసిన ప్రతిపాదనను పక్కన పెట్టి భావనపాడును ప్రైవేట్ రంగానికి అప్పగించేందుకు రంగం సిద్ధం చేయటం మంచిది కాదని ఆయన తమ లేఖలో స్పష్టం చేశారు. మొదటి దశలో ఐదు బెర్త్‌లను నిర్మించేందుకు రెండు వేల ఐదు వందల కోట్ల విలువ చేసే భూమిని ప్రైవేట్ రంగానికి అప్పగిస్తారా? అని కూడా నిలదీశారు. భావనపాడును ప్రైవేట్ రంగానికి అప్పగించాలన్న నిర్ణయం పట్ల ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారని ఆయన హెచ్చరించారు. భావనపాడును పబ్లిక్ రంగంలో చేపడితే స్థానిక ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని ఆయన సూచించారు.