జాతీయ వార్తలు

జిఎస్‌టిపై తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) విషయంలో ఎవరి అజమాయిషీ ఎంత అనే దానిపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆదివారం నిర్వహించిన సమావేశం ఈ ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైంది. ఎక్సైజ్ సుంకం, సేవా పన్ను, విలువ జోడించిన పన్ను (వ్యాట్) తదితర వివిధ రకాల పన్నులను కలగలిపి వచ్చే ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న జిఎస్‌టిలో ఎవరి అజమాయిషీ ఎంత అనే దానిపై ఈ సమావేశంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య అంగీకారం కుదరలేదని ఈ భేటీలో పాల్గొన్న పలువురు మంత్రులు తెలిపారు. ఏడాదికి కోటిన్నర రూపాయల లోపు టర్నోవర్‌ను కలిగివున్న పన్ను చెల్లింపుదారులపై అజమాయిషీ హక్కు తమ చేతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాలు తమ పట్టును ఏమాత్రం సడలించలేదు. దీంతో ఈ నెల 25వ తేదీన జరిగే జిఎస్‌టి కౌన్సిల్ సమావేశానికి ముందు అధికారులు సోమవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశం ముగిసిన తర్వాత అరుణ్ జైట్లీ విలేఖరులతో మాట్లాడుతూ, ఈ సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, ఈ నెల 25వ తేదీన చర్చలు కొనసాగుతాయని తెలిపారు. వస్తు, సేవల పన్ను విషయంలో ఎవరి అజమాయిషీ ఎంత అనేదానిపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య గత రెండు జిఎస్‌టి కౌన్సిల్ సమావేశాల నుంచి కొనసాగుతున్న ప్రతిష్టంభన ఇప్పటికీ తొలగలేదని, దీనిపై తదుపరి సమావేశంలో కూడా అంగీకారం కుదరకపోతే జిఎస్‌టి అమలు పట్టాలు తప్పే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.