జాతీయ వార్తలు

నా అప్పునూ మాఫీ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: తమ బ్యాంకులో పేరుకుపోయిన దీర్ఘకాలిక అప్పులను ‘రైట్-ఆఫ్’ చేస్తున్నట్లు ఇటీవల భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) ప్రకటించడంతో, తన అప్పును కూడా మాఫీ చేయాలని ఓ సపాయి ఉద్యోగి ఎస్‌బిఐకి లేఖ రాశాడు. మహారాష్టల్రోని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్‌లో భౌరవ్ సోనావానె సఫాయి కార్మికుడుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయనకు ఎస్‌బిఐలో 1.5 లక్షల అప్పుంది. తన కుమారుడి అనారోగ్యం కారణంగా తానీ అప్పు చేశానని, విజయ్ మాల్యా లోనును మాఫీ చేసినట్లుగానే తన అప్పునూ మాఫీ చేయాలని బ్యాంకు మేనేజర్‌కు లేఖ రాశాడు. దీంతోపాటు బ్యాంకు తీసుకున్న నిర్ణయానికి అభినందనలు కూడా తెలిపాడు. ఇలావుండగా గత శుక్రవారం రాజ్యసభలో ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇస్తూ, ‘రైట్-ఆఫ్’ అంటే రుణాలను మాఫీ చేయడం కాదని, ఈ అప్పులను వసూలు చేసి తీరతామని ప్రకటించడం గమనార్హం.