జాతీయ వార్తలు

పన్ను ఎగవేతదారులంతా ప్రధానికి స్నేహితులే: జైరామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: పనామాలో అక్రమ సంపాదనను దాచుకున్న పన్ను ఎగవేతదారులంతా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి స్నేహితులు, శ్రేయోభిలాషులేనని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జైరామ్ రమేష్ ఆరోపించారు.
జైరామ్ రమేష్ గురువారం ఏఐసిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పనామాలో అక్రమ సంపాదన దాచుకున్న వారిపై దర్యాప్తు జరిపేందుకు ఏర్పాటు చేసిన బహుళ సంస్థల సంఘం లక్ష్యం స్పష్టంగా లేదని విమర్శించారు. పనామా అక్రమ సంస్థలపై విచారణ జరిపేందుకు దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అసంతృప్తిని మిగిల్చిందని ఆయన స్పష్టం చేశారు. పనామా పత్రాలపై ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న ఆగ్రహం మూలంగానే కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది తప్ప చిత్తశుద్ధితో కాదని కాంగ్రెస్ నేత ధ్వజమెత్తారు. కంటి తుడుపు చర్యగానే దర్యాప్తు సంఘాన్ని ఏర్పాటు చేసింది తప్ప నిజంగా దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాలనే ఆలోచన ఎన్‌డిఏ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ కుమారుడు, రాజనంద్‌గాంవ్ బిజెపి లోక్‌సభ సభ్యుడు అభిషేక్ సింగ్ విదేశాల్లో నిధులు దాచుకున్నారని ఆయన ఆరోపించారు. ఆయన విదేశాల్లో అక్రమంగా సంస్థలు ఏర్పాటు అక్రమ సంపాదనను అక్కడికి తరలించారంటూ ఐసిఐజె (ఇంటర్ నేషనల్ కంసార్టియం ఆఫ్ ఇనె్వస్టిగేటివ్ జర్నలిజం) గత సంవత్సర కాలంగా చెబుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదని జైరామ్ నిలదీశారు.