జాతీయ వార్తలు

వివాదాస్పద ఆర్డినెన్స్‌ను రాష్టప్రతికి పంపిన యుపి గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, నవంబర్ 20: నగర మేయర్లు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థల చైర్‌పర్సన్ల ఆర్థిక, పాలనాపరమైన అధికారాలను కుదించడానికి ఉద్దేశించిన రెండు బిల్లులకు ఆమోదం తెలపడానికి నిరాకరించిన అనంతరం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ రామ్‌నాయక్ ఆదివారం రాష్టప్రతికి నివేదించారు. ఉత్తరప్రదేశ్ పట్టణప్రాంత స్థానిక ప్రభుత్వ చట్టాల సవరణ ఆర్డినెన్స్‌ను రాష్ట్ర మంత్రివర్గం అక్టోబర్ 17న ఆమోదించి అదే నెల 28న గవర్నర్ ఆమోదముద్ర కోసం పంపించింది. గవర్నర్ ఈ ఆర్డినెన్స్ ముసాయిదాను పరిశీలించిన అనంతరం స్థానిక సంస్థల స్వయం ప్రతిపత్తికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించారని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన తెలిపింది. దీంతో ఆ ఆర్డినెన్స్‌ను రాష్టప్రతికి నివేదించినట్లు ఆ ప్రకటన తెలిపింది. మేయర్లు, నగర పాలిక చైర్మన్లు మొదలుకొని వివిధ కేటగిరీల అధికారులు, ఉద్యోగులను నియమించే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికి స్థానిక సంస్థల డైరెక్టర్లకు అధికారం ఇచ్చేందుకు ఈ ఆర్డినెన్స్‌ను రూపొందించారు. ఇదే తరహా నిబంధనలున్న రెండు బిల్లులకు ఆమోదం తెలపడానికి గవర్నర్ నిరాకరించిన తర్వాత ఉత్తరప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆజమ్ ఖాన్ ఈ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని నిర్ణయించారు.