జాతీయ వార్తలు

మునిగిపోతున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: పెద్దనోట్లను రద్దు చేయటం వల్ల తమ ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటోందని వివిధ రాష్ట్రాలు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించాయి. జిఎస్‌టి పన్ను పరిధికి సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగించేందుకు వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నోట్ల రద్దు ప్రధాన అంశంగా మారింది. నోట్ల రద్దు కారణంగా రాష్ట్రాల్లో తీవ్ర పారిశ్రామిక ఆర్థిక సంక్షోభం తలెత్తి, పన్నుల వసూలు కష్టమవుతుందని పశ్చిమబెంగాల్ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా పేర్కొన్నారు. తమిళనాడు కూడా మిగతా రాష్ట్రాలతో గొంతు కలిపింది. తమ రాష్ట్రంలో పారిశ్రామిక కార్యకలాపాలపై నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపిందని పేర్కొంది. కాన్పూర్, మొరాదాబాద్‌లలో చాలా కంపెనీలు కేంద్ర అనాలోచిత నిర్ణయం వల్ల మూతపడ్డాయని ఉత్తరప్రదేశ్ ఆరోపించింది. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రాల ఆదాయంపై ప్రభావం చూపిస్తోందన్నారు. ‘86శాతం సొమ్ము ఒక్కసారిగా మాయమైతే ప్రజలకు సమస్య. పెట్టుబడులు రావు. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది’ అని ఇసాక్ అన్నారు. నల్లధనం, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయాన్ని దెబ్బతీయడానికి దేశంలో దాదాపు 14లక్షల కోట్ల రూపాయల విలువైన రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ నవంబర్ 8న ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని రాష్ట్రాలూ తమ ఆదాయం, రెవిన్యూపై కేంద్ర నిర్ణయం ప్రభావం చూపుతుందని అంగీకరించినా, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్ప మరెవ్వరూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేయలేదు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్ మాత్రం తాత్కాలికంగా ఈ నిర్ణయాన్ని కొద్ది రోజులపాటు వాయిదా వేయాలని కోరారు.

చిత్రం.. అగర్తలాలోని ఓ మార్కెట్లో పాత నోట్లు చెల్లవు అంటూ
బోర్డులను వేలాడదీసిన వ్యాపారస్థులు