జాతీయ వార్తలు

పథకాలు ఫలిస్తే.. అగ్రస్థానం మనదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, నవంబర్ 20: ‘క్లీన్ ఇండియా’ (స్వచ్ఛ భారత్), ‘డిజిటల్ ఇండియా’లాంటి వినూత్న పథకాలను విజయవంతంగా అమలు చేసినట్లయితే భారతదేశం ప్రపంచంలోనే ఆధునిక ఆర్థిక శక్తిగా తయారవుతుందని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. భారతదేశం రెండో హరితవిప్లవం చేరువలో ఉన్నందున, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచడాన్ని ఇజ్రాయెల్‌ను చూసి నేర్చుకోవాలని రాష్టప్రతి అన్నారు. ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించిన అన్ని రంగాల్లో మన ప్రభుత్వం చేపట్టిన వినూత్న పథకాలు ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా, క్లీన్ ఇండియా, స్మార్ట్ ఇండియా, డిజిటల్ ఇండియాలాంటి వినూత్న పథకాలను గనుక విజయవంతంగా అమలు చేసినట్లయితే ప్రాచీన నాగరికత కలిగిన భారతదేశం ప్రపంచంలోనే ఒక భోగభాగ్యాలతో తులతూగే ఆధునిక ఆర్థికశక్తిగా మారిపోతుందని ఆదివారం ఇక్కడ వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై సిఐఐ ఏర్పాటు చేసిన సదస్సులో మాట్లాడుతూ రాష్టప్రతి అన్నారు. ఆధునిక ఆర్థిక శక్తి కావడానికి మనకున్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, అలాగే వ్యవసాయ ఉత్పాదకతను గరిష్ఠస్థాయికి పెంచడం అవసరమని ఆయన చెప్పారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాలను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకున్న ఇజ్రాయెల్‌నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలని దేశాన్ని ఆహార మిగులు, నీటిమిగులు దేశంగా చేయడంలో ఇజ్రాయెల్ కృషిని ప్రశంసిస్తూ అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్ మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసుకున్నట్లయితే ప్రపంచంలోనే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ‘ఇజ్రాయెల్ పరిశ్రమలు, భారతీయ రైతులు కలిసి పని చేసినప్పుడు అద్భుతాలను సృష్టిస్తున్నారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగడంలో ప్రతి దేశానికి తనదైన మార్గముంటుందని మీరు ఒకప్పుడు చెప్పారు. నూతన ఆవిష్కరణల విషయంలో భారతదేశం అగ్రగామిగా ఉందని, అందువల్ల ఉన్నత శిఖరాలకు చేరుకోగలదు’ అని కూడా ఆయన అన్నారు. ఆహార భద్రత ప్రాధాన్యత గురించి భారత దేశం ఇజ్రాయెల్‌కు నేర్పిందని ఆయన అన్నారు. హిందీ పదం ‘జుగద్’ అంటే తనకు ఇష్టమని రివ్లిన్ అంటూ, తమకు అనుకూలంగా నియమ నిబంధనలను మార్చుకొని, నూతన విషయాలను కనుగొనడమే ఇజ్రాయెల్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని అన్నారు. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆహ్వానంపై రివ్లిన్ మన దేశంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.

చిత్రం.. చండీగఢ్‌లో ఆదివారం వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సును ప్రారంభిస్తున్న రాష్టప్రతి ప్రణబ్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు రూవెన్ రివ్లిన్