జాతీయ వార్తలు

ప్రయాణాలను సురక్షితం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరజ్‌కుంద్/ఆగ్రా, నవంబర్ 20: రైలు ప్రయాణాలను సురక్షితం చేసేందుకు ప్రమాదాలకు తావులేకుండా చూడాలన్న లక్ష్యంతో పనిచేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైల్వేలకు విజ్ఞప్తిచేశారు. ఆదివారం ఆయన ఢిల్లీ శివార్లలోని సూరజ్‌కుంద్‌లో రైల్వేల అభివృద్ధి శిబిరంలో ప్రసంగిస్తూ, ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్ వద్ద పట్టాలు తప్పి 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పిస్తూ ప్రధానితోపాటు రైల్వే సిబ్బంది రెండు నిమిషాలు వౌనం పాటించారు. ఈ ప్రమాదం అత్యంత విచారకరమైనదని మోదీ పేర్కొంటూ, రైలు ప్రయాణాల్లో ప్రమాదాలకు తావులేకుండా చూసేందుకు కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం ఆగ్రాలో ఒక ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ, కాన్పూర్ రైలు ప్రమాదం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మరణించిన ప్రయాణికుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రైల్వేల అభివృద్ధి శిబిరంలో గంటకు పైగా సమయాన్ని గడిపిన మోదీకి రైల్వేలు నిర్వర్తిస్తున్న కార్యకలాపాలపై అధికారులు సమగ్రమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. రైల్వేలకు సంబంధించిన వివిధ అంశాలను వివరిస్తూ ఏర్పాటుచేసిన గ్యాలరీని మోదీ సందర్శించారు. రైల్వేలను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మూడు రోజులపాటు నిర్వహించిన ఈ శిబిరం ఆదివారంతో ముగిసింది.

చిత్రం.. సూరజ్‌కుంద్‌లో రైల్వేల అభివృద్ధి శిబిరంలో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ