జాతీయ వార్తలు

మా వాళ్లు ఏమయ్యారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండోర్, నవంబర్ 20: ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు సమీపంలో ఘోర ప్రమాదానికి గురయిన ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కిన సుమారు 200 మంది ప్రయాణికుల బంధువులు తమ వారి యోగక్షేమాలు తెలియక ఆందోళనతో స్థానిక రైల్వే స్టేషన్‌కు చేరుకుని తమ బంధువుల యోగక్షేమాల గురించి ఆదుర్దాగా అడగడం కనిపించింది. ‘ఇప్పటివరకు దాదాపు 200 మంది ప్రయాణికుల గురించి ఎంక్వయిరీలు మాకు వచ్చాయి. రైల్వేల సహాయంతో వీరికి సంబంధించిన సమాచారం సేకరించడానికి మేము ప్రయాణిస్తున్నాం’ అని ఇండోర్ రైల్వే స్టేషన్‌లో గవర్నమెంట్ రైల్వే పోలీసు(జిఆర్‌పి) వద్ద హెల్ప్ సెంటర్‌ను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థకు చెందిన అజయ్ ఝా చెప్పారు. రైలు పట్టాలు తప్పిన ఘటనలో తీవ్రంగా దెబ్బతిన్న ఎస్-1,ఎస్-2,ఎస్-3 బోగీల్లో ఎక్కిన సుమారు 200 మందికి సంబంధించిన బంధువులు తమ వారి క్షేమసమాచారాల కోసం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని ఆయన చెప్పారు. రైలు ప్రమాదంలో మృతిచెందిన, గాయపడిన వారికి సంబంధించిన అదికారిక జాబితా ఏదీ ఇప్పటివరకు తమకు అందలేదని జిఆర్‌పి సూపరింటెండెంట్ మహేశ్ చంద్ర జైన్ చెప్పారు. అయితే ప్రమాదం తర్వాత ఇప్పటివరకు తమ బంధువులను సంప్రదించని ప్రయాణికుల గురించి సమాచారం తెలుసుకోవడానికి జిఆర్‌పి శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. కాగా, ఎలాంటి సమాచారం లేని ప్రయాణికుల బంధువులను ఇక్కడినుంచి భోపాల్‌కు పంపించడానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. అక్కడినుంచి వారంతా తమ ఆత్మీయుల కోసం వెతకడానికి ప్రమాదం జరిగిన కాన్పూర్ దేహత్‌కు వెళ్లాలనుకుంటున్నారని ఆయన చెప్పారు.

చిత్రం.. కాన్పూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం ఘటనా స్థలంలో సహాయ చర్యల్లో పాల్గొంటున్న స్థానికులు ..