జాతీయ వార్తలు

యావద్భారతం దిగ్భ్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 20: ఉత్తరప్రదేశ్‌లో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదం పట్ల యావద్భారతం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ సహా వివిధ పార్టీలకు చెందిన నేతలు మృతుల కుటుంబాలకు తీవ్ర సంతా పం తెలియజేశారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభు త్వం సత్వర చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులను యుద్ధ ప్రాతిపదికన ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయించాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఈ మేరకు యుపి గవర్నర్ రామ్‌నాయక్‌కు ఓ సందేశం పంపా రు. పాట్నా-ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టా లు తప్పిన కారణంగా 115మం ది మరణించడం మాటలకందని ఆవేదన కలిగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని పేర్కొన్న మోదీ వారికి రెండు లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి 50వేల రూపాయల పరిహారాన్ని అందిస్తామని తెలిపారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు వ్యక్తిగతంగా సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. మృతులకు సంతాప సూచకంగా రెండు నిమిషాలపాటు వౌనం పాటించారు. ఇలాం టి ప్రమాదాలు పునరావృతం కాకుం డా తగిన చర్యలు తీసుకోవాలని, సురక్షిత ప్రయాణానికి అవసరమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖను ఆదేశించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా ఈ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాట్నా ఇండోర్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. ప్రమాద కారణంగా బోగీలు నుగ్గునుగ్గు కావడంతో అందులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు తీసేందుకు ఐదు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పంపించినట్లు తెలిపారు. మరోపక్క రైల్వే మంత్రి సురేష్ ప్రభు కూడా ప్రమాదంపై దర్యాప్తుకు ఆదేశించడంతో పాటు మృతుల కుటుంబాలకు మూడున్నర లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. క్షతగాత్రులకు 50వేల రూపాయలు అందిస్తామని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారాన్ని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐదు లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని అఖిలేష్ యాదవ్ ప్రకటించారు. ఈ ప్రమాదం తమ రాష్ట్రంలో జరిగింది కాబట్టే సత్వర ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత తమపైనే ఉంటుందని, ప్రమాదం జరిగిన వెంటనే క్షణం ఆలస్యం లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, సాధ్యమైనంత మేర ప్రయాణికుల ప్రాణాలను కాపాడామని తెలిపారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అసోం ముఖ్యమంత్రి సోనోవాల్, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
దత్తాత్రేయ దిగ్భ్రాంతి
పాట్నా ఎక్స్‌ప్రెస్ ఘోర ప్రమాదం పట్ల దత్తాత్రేయ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతా పం తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిత్రాలు..కాన్పూర్ సమీపంలో ఆదివారం జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నుజ్జు నుజ్జయన ఇండోర్ పాట్నా ఎక్స్‌ప్రెస్ బోగీలు..
క్రేన్ సహాయంతో బోగీని తొలగిస్తున్న దృశ్యం.. బోగీల నుండి బయటకు తీసుకువచ్చిన ప్రయాణికుల సామగ్రి