జాతీయ వార్తలు

వినాశకర రాజకీయ తప్పిదమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 20: బాబ్రీ మసీదుకు ముప్పు పొంచి ఉన్న విషయాన్ని అనేక సాక్ష్యాలు వెల్లడించినప్పటికీ ఆ మసీదును కేంద్రం నియంత్రణలోకి తీసుకు రాకపోవడం అప్పటి పివి నరసింహారావు ప్రభుత్వం చేసిన ‘వినాశకరమైన రాజకీయ తప్పిదం’ అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి పి.చిదంబరం అన్నారు. బాబ్రీ మసీదు విధ్వంసాన్ని కేవలం పరిస్థితిని అంచనా వేయడంలో జరిగిన పొరపాటు అనే అభిప్రాయాన్ని ఆయన తోసిపుచ్చుతూ ఈ సంఘటన వల్ల పివి నరసింహారావు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్నారు. ‘మసీదు ప్రమాదంలో ఉందని అనేక మంది నరసింహారావుకు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మసీదు కూల్చివేతను అనుమతించబోమని మా ప్రభుత్వం ప్రకటించింది. అవసరమైతే, మిలిటరీ, పారా మిలిటరీ బలగాలను అక్కడ ఉంచుతామని పేర్కొంది’ అని ఆదివారం ఇక్కడ జరిగిన టాటా లిటరేచర్ లైవ్ ఫెస్టివల్‌లో ‘నరసింహారావు: ద ఫర్‌గాటెన్ హీరో’ అనే అంశంపై మాట్లాడుతూ చిదంబరం వివరించారు. మసీదుకు వచ్చిన ముప్పు ఉన్నపళంగా వచ్చింది కాదని, కరసేవకుల ఆకస్మిక చర్య కాదని ఆయన పేర్కొన్నారు. కరసేవకులు రామేశ్వరం వంటి సుదూర ప్రాంతాల నుంచి రాళ్లను తరలించారు. అన్ని రైళ్లను బుక్ చేసుకున్నారు. లక్షలాది మంది అక్కడికి (అయోధ్యకు) చేరుకోబోతున్నారని ప్రతి ఒక్కరికీ తెలుసు. బాబ్రీ మసీదుకు నిజమైన ముప్పు 1987-88 నుంచే మొదలయింది’ అని చిదంబరం అన్నారు. అప్పటి ప్రధాని నరసింహారావు మిలిటరీ, పారా మిలిటరీ బలగాలను అక్కడికి తరలించి ఉండవలసిందని, బాబ్రీ మసీదు ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రాంతంగా స్పష్టంగా ప్రకటించవలసి ఉండిందని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు చర్యలు చేపట్టకపోవడం ‘వినాశకర రాజకీయ తప్పిదం’ అని ఆయన అభివర్ణించారు. ఈ సంఘటన తరువాత దేశంలో పరిణామాలు భయానకంగా మారాయని ఆయన పేర్కొన్నారు.