జాతీయ వార్తలు

పని లేక..డబ్బులు రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్దా, నవంబర్ 20: పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పటి వరకు అనేక మంది ప్రాణాలను బలిగొన్న నేపథ్యంలో మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎన్ని సార్లు తిరిగినా బ్యాంకు నుంచి నగదు రాకపోవటం, కుటుంబాన్ని పోషించలేక గోవింద్ సర్కార్ అనే ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్తున్నారు. మాల్దాలోని ఓ బ్యాంకులో తనకు ఖాతా ఉన్నప్పటికీ నగదు తీసుకోలేక పోవటం వల్లనే ఈ చర్యకు ఒడిగట్టినట్టుగా పోలీసులు తెలిపారు. పనె్నండు వేల రూపాయలను తీసుకోవటానికి అతడు బ్యాంకుకు వెళ్లాడని, అది సాధ్యం కాకపోవటం వల్ల తీవ్ర నిరాశా నిస్పృహలకు లోనై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడని తెలిపారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం దుప్పటి మెడకు చుట్టుకుని సీలింగ్ ఫ్యాన్‌కు తగిలించుకుని బలవన్మరణానికి ఒడిగట్టినట్లు తెలుపుతున్నాడు. అతడు దినసరి కూలీ కావటంతో ఎక్కడా పని దొరక్క తీవ్ర నిరాశకు లోనయ్యాడని, తాను దాచుకున్న డబ్బులు తానే తీసుకునే పరిస్థితులు లేకపోవటంతో కుంగిపోయాడని పోలీసులు వెల్లడించారు. కనీసం తమకు తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడిందని, తమ కుటుంబమే సర్వనాశనమైపోయిందని ఆయన భార్య అంగూరీ ఆవేదన వ్యక్తం చేశారు. చెల్లుబాటులో ఉన్న నగదును ప్రభుత్వం ఒక్కసారిగా ఎలా రద్దు చేస్తుందంటూ ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.