జాతీయ వార్తలు

‘ఓటుకు నోటు’ విచారణ రెండు వారాలు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: సుప్రీంకోర్టులో జరూసలెం మత్తయ్య కేసు విచారణ రెండు వారాలు వాయిదా పడింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్య పేరును చార్జ్‌షీట్ నుండి తొలగిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) అధికారులు సుప్రీంకోర్టులో సవాలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సోమవారం న్యాయమూర్తులు ఎస్.ఎ.బాబ్డే, అశోక్ భూషణ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. దీనిపై మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నాలుగు వారాల గడువు కావాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో మత్తయ్య పాత్ర ఉందనడానికి సాక్ష్యాలు ఉన్నాయని ఏసిబి తరపు న్యాయవాది హరీన్ రావల్ వాదించారు. అయితే ఈ పిటిషన్‌పై వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని మత్తయ్యను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేసింది.