జాతీయ వార్తలు

విచ్ఛిన్నవాది మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరుఖేట్రి (అసోం), ఏప్రిల్ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. నాగ్‌పూర్ నుంచి జారీ అవుతున్న ఆదేశాలకు అనుగుణంగా మతతత్వ రాజకీయాలకు పాల్పడుతున్న బిజెపి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె ప్రజలను కోరారు. అసోంలోని బార్పేట జిల్లా సరుఖేట్రిలో గురువారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎన్నికల సభలో సోనియా గాంధీ మాట్లాడుతూ, ప్రధాని మోదీ విదేశాలలో పర్యటించినప్పుడు మన దేశ గొప్పదనం గురించి ఉపన్యాసాలు ఇస్తున్నారని, తిరిగి రాగానే ఇక్కడ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అసోంలో ఎంతోకాలంగా ప్రజల మధ్య ప్రేమ, శాంతి, సామరస్యాలతో నిర్మితమైన సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి బిజెపి ప్రమాదకరమైన మతతత్వ రాజకీయాలను వ్యాప్తి చేస్తోందని సోనియా నిప్పులు చెరిగారు. ‘అసోం వెల్లివిరుస్తున్న మత సామరస్యానికి మంచి ఉదాహరణ. ఇక్కడి ప్రజలు శంకరదేవ, ఆజాన్ ఫకీర్ బోధనలను ఆచరిస్తుంటారు. మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ తప్పుడు వాగ్దానాలు చేయడంతో పాటు ప్రజల మధ్య చీలికలు తెస్తున్నారు’ అని ఆమె ధ్వజమెత్తారు. ‘బిజెపి మతతత్వ రాజకీయాలను నాగ్‌పూర్ నుంచి నియంత్రిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి పెనుముప్పు’ అంటూ సోనియా పరోక్షంగా ఆర్‌ఎస్‌ఎస్ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న అభివృద్ధి ప్రణాళికలో పార్టీ ఎల్లవేళలా అన్ని మతాలు, కులాలు, తెగలు, విశ్వాసాలకు చెందిన వారిని భాగస్వాములను చేసిందని ఆమె వివరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఐక్యం చేసే పని చేస్తుంటే, బిజెపి ప్రజలను చీల్చే పనిచేస్తోందని సోనియా విమర్శించారు.

చిత్రం అసోంలోని సరుఖేట్రిలో గురువారం
నిర్వహించిన ఎన్నికల సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న సోనియా గాంధీ