జాతీయ వార్తలు

మీదే ఆలస్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 21: తెలంగాణలోని జాతీయ రహదారుల విస్తరణకు అవసరమైన భూమిని వీలైనంత త్వరగా సేకరించి ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీకి హామీ ఇచ్చారు. రానున్న ఐదేళ్లలో తెలంగాణలో జాతీయ రహదాలను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తామని, గతంలో ఎన్నడూ జరగనంత ఎన్‌హెచ్‌ల అభివృద్ది రానున్న ఐదేళ్లలో చేపడతామని సిఎం కెసిఆర్‌కు గడ్కరీ హామీ ఇచ్చారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం కెసిఆర్ సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర రోడ్లు భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. లోక్‌సభలో తెరాస పక్షం నాయకుడు జితేందర్ రెడ్డి, ఎంపీలు బి వినోద్‌కుమార్, ప్రత్యేక ప్రతినిధి తేజావత్, కీలక అధికారులు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. ఎన్‌హెచ్‌లకు సంబంధించి భూసేకరణ వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరుపుతామని గడ్కరీకి కెసిఆర్ హామీ ఇచ్చారు. భూసేకరణను ప్రభుత్వం ఎంతవేగంగా ముగిస్తే, తాము అంత త్వరగా రోడ్ల విస్తరణను పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పుకొచ్చారు. తెలంగాణలో భూసేకరణ ఆశించిన స్థాయిలో జరగకపోవటం వల్లే రాష్ట్రంలోని ఎన్‌హెచ్‌ల విస్తరణ ఆశించిన స్థాయిలో జరగటం లేదని గడ్కరీ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రకటించిన జాతీయ రహదారులకు సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వాలని కోరగా, ఒకటి రెండు రోజుల్లో ఇస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్టు సమావేశం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే ప్రకటించిన జాతీయ రహదారుల కోసం తయారు చేసిన డిపిఆర్‌ను ఆమోదించాలని కూడా కేంద్ర మంత్రిని కోరామన్నారు. జాతీయ రహదారుల అథారిటీకి ఇచ్చిన 650 కిలోమీటర్ల రహదారి భూసేకరణకూ తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వాలన్న విజ్ఞప్తినీ గడ్కరీ అమోదించారని తుమ్మల వివరించారు. రాష్ట్రంలోని 2600 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ది చేసేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించిందన్నారు. గోదావరిని జల రహదారులుగా అభివృద్ది చేయాలన్న సిఎం కెసిఆర్ ప్రతిపాదననూ కేంద్రం ఆమోదించిందని ఇరువురు నేతలు తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ సమస్యపై చర్చించేందుకు కెసిఆర్ త్వరలోనే జిల్లా కలెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమవుతారని వినోద్‌కుమార్ చెప్పారు.
నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపించిన 1290 కోట్ల ప్రతిపాదనలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించి పంపుతామని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హామీ ఇచ్చినట్టు తుమ్మల వివరించారు. రాష్ట్ర ఐటి, పురపాలక మంత్రి కెటి రామారావుతో కలిసి సోమవారం ఉదయం రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, కేంద్రం అందించాల్సిన ఆర్థిక సాయంపై చర్చించామన్నారు. పాత జిల్లాలైన వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్‌లలో రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు కేటాయించాలని రాజ్‌నాథ్‌ను కోరామన్నారు.

చిత్రం.. కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సిఎం కెసిఆర్, ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల, ఎంపీ వినోద్