జాతీయ వార్తలు

ప్రధానికి ధిక్కార నోటీసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: పెద్దనోట్ల రద్దు వంటి విధాన నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో కాకుండా వెలుపల ప్రకటించవచ్చా అన్నదానిపై సిపిఎం పార్టీ న్యాయ నిపుణులను సంప్రదిస్తోంది. పార్లమెంటులో కాకుండా సభ వెలుపల ఇలాంటి ప్రకటన చేయడాన్ని పార్టీ తప్పుపడుతోంది. ‘సభ వెలుపల విధాన నిర్ణయం ప్రకటిస్తే దానిపై తరువాత ఉభయ సభల్లో ప్రధాని ప్రకటన చేయాల్సి ఉంటుంది. రాష్టప్రతి ఈ మేరకు జోక్యం చేసుకోవాలి’ అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం ఇక్కడ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీకి ధిక్కారణ నోటీసు ఇచ్చే అంశంపై న్యాయకోవిదులతో సంప్రదింపులు జరపనున్నట్టు ఆయన వెల్లడించారు. పార్లమెంటులో వివరణ ఇవ్వకుండా మోదీ అహకారపూరితంగా, మొండిగా వ్యవహరిస్తున్నారని ఏచూరి ధ్వజమెత్తారు.