జాతీయ వార్తలు

భయపడేవాళ్లంతా నల్లధనం ఉన్నవాళ్లే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్మోరా, నవంబర్ 22: నల్లధనం దాచుకున్నవాళ్లే పెద్దనోట్ల రద్దుపట్ల భయపడుతున్నారని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. అల్మోరాలో మంగళవారం జరిగిన ఓ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ‘‘ఇళ్లల్లో నల్లధనం లేనివాళ్లు భయపడటానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? మన నేత ముఖాల్లో ఆందోళనలను మీరు గమనిస్తున్నారా? రాహుల్ బాబా ముఖాన్ని గమనించండి.. ఆయన ఎంత ఆందోళనతో ఉన్నారో కనిపిస్తుంది’’ అన్నారు. సమాజ్‌వాదీ చీఫ్ ములాయంసింగ్ యాదవ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తెగ ఆందోళన చెందుతున్నారని అన్నారు. నల్లధనం, ఉగ్రవాదం, నక్సలిస్టు ఉద్యమం, డ్రగ్ మాఫియా వంటివన్నీ పెద్దనోట్ల రద్దుతో దారుణంగా ప్రభావితమయ్యాయని షా వ్యాఖ్యానించారు. మోదీ ఒక్క సంతకంతో నల్లధనాన్ని చిత్తుకాగితంలా మార్చేశారని ప్రశంసించారు. ‘నవంబర్ 7న నల్లధనం విషయంలో మోదీ ఏం చేస్తున్నారని వారే ప్రశ్నించారు. నవంబర్ 8న మోదీజీ తన నిర్ణయాన్ని ప్రకటించిన క్షణంనుంచీ ఎందుకు చేశారని ప్రశ్నిస్తున్నారు. బంగ్లాల్లో లక్షలు, కోట్లు దాచుకున్నవారే భయపడుతున్నారు’’ అని షా విమర్శించారు. శరీరానికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఆపరేషన్ చేయాల్సిందే. అలాగే దేశానికి నల్లధనం చీడగా పట్టినప్పుడు దాన్ని తొలగించటానికీ ఆపరేషన్ చేయాలి’’ అన్నారు. యూపిలో అవినీతి రహిత ప్రభుత్వానికి ఓటేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

చిత్రం.. అల్మోరాలో మంగళవారం జరిగిన బహిరంగసభలో మాట్లాడుతున్న అమిత్ షా