జాతీయ వార్తలు

తల్లిదండ్రుల ఇంటిలో కొడుక్కు హక్కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: తల్లిదండ్రుల స్వార్జితమైన ఇంటిలో నివసించేందుకు పెళ్లయినా, కాకపోయినా కుమారుడికి ఎలాంటి హక్కూ లేదని, వారి దయాదాక్షిణ్యాలపై మాత్రమే అతను ఆ ఇంటిలో ఉండవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. సుహృద్భావ సంబంధాలు కొనసాగినంతకాలం తల్లిదండ్రులు తమ కుమారుడ్ని ఇంటిలో ఉండడానికి అనుమతించినంత మాత్రాన జీవితాంతం అతని భారాన్ని వారు భరించాలని అర్థం కాదని కూడా కోర్టు స్పష్టం చేసింది. ‘ఇల్లు తల్లిదండ్రుల స్వార్జితం అయినప్పుడు కుమారుడికి పెళ్లయినా, కాకపోయినా ఆ ఇంటిలో నివసించే హక్కు లేదని, వారి దయాదాక్షిణ్యాలపైన, వారు అనుమతించినంత కాలమే ఆ ఇంటిలో ఉండవచ్చు’ అని న్యాయమూర్తి ప్రతిభా రాణి ఒక ఉత్తర్వులో పేర్కొన్నారు. తల్లిదండ్రులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ ఒక వ్యక్తి, అతని భార్య దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టివేస్తూ కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. తమ కుమారులు, కోడళ్ల అధీనంలో ఉన్న పోర్షన్లను ఖాళీ చేయాలని ఆదేశించాలని సీనియర్ సిటిజన్లయిన తల్లిదండ్రులు తమ పిటిషన్‌లో కోరారు. ఇల్లు తమ స్వార్జితమని, అందువల్ల తాము ఉంటున్న పోర్షన్లను ఖాళీచేసి వెళ్లిపోవాలని సీనియర్ సిటిజన్లయిన తల్లిదండ్రులు తమతోపాటే ఉంటున్న ఇద్దరు కుమారులు, కోడలిని కోరినా వారు ఖాళీ చేయకపోవడంతో 2007లో వారు పోలీసులను ఆశ్రయించడంతోపాటుగా 2012లో పబ్లిక్ నోటీసులు కూడా ఇచ్చారు. అప్పటినుంచి తమ కుమారులు, కోడలు తమకు నరకం చూపిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, ఇంటి నిర్మాణంలో తాము కూడా డబ్బులు ఇచ్చామని, అందువల్ల ఆ ఇంటిలో తమకు కూడా హక్కు ఉందని కుమారులు వాదించారు.