జాతీయ వార్తలు

సోనియాకు అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో మంగళవారం ఇక్కడ గంగారాం ఆసుపత్రిలో చేరారు. వైరల్‌ఫీవర్‌తో సోనియా ఆసుపత్రిలో చేరారని, రెండు రోజుల్లో డిశ్చార్జి అవుతారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల తెలిపారు. పార్టీ అధ్యక్షురాలి ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. ‘రెండు రోజుల్లో సోనియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అవుతారు. యథావిధిగా పార్లమెంటు సమావేశాలకు హాజరవుతారు’ అని సుర్జేవాల తెలిపారు. 69 ఏళ్ల సోనియా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని, ఆసుపత్రిలో చేరమని వైద్యులు సలహా ఇచ్చారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సర్ గంగారాం ఆసుపత్రిలో సోనియాకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఆగస్టు నెలలో వారణాసి రోడ్‌షోలో పాల్గొన్న సోనియాగాంధీ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. అప్పుడూ రంగారాం ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందించారు.