జాతీయ వార్తలు

తీరాన్ని తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: ఆంధ్రప్రదేశ్‌లో సముద్ర తీరాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను కేంద్ర ప్రభుత్వానికి అందజేసినట్లు రాష్ట్ర కార్మిక, యువజన వ్యవహారాల శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆయన శనివారం కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఏర్పాటు చేసిన జాతీయ సాగరమాల అపెక్స్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర సముద్ర తీరంలోని అన్ని ఓడరేవులను అనుసంధానం చేస్తున్నామని, ఓడ రేవులున్న ప్రాంతంలో విమానాశ్రయాలు, రైల్వే సౌకర్యం కూడా ఏర్పాటవుతాయని తెలిపారు. ఓడ రేవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను అపెక్స్ కమిటీకి వివరించినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడలో లాజిస్టిక్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రాయ్‌పూర్-విజయనగరం రైల్వే లైనును విద్యుద్దీకరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన వెల్లడించారు. బకింగ్‌హామ్ కాలువను అభివృద్ధి చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. కేంద్రం ప్రవేశపెట్టిన సిఆర్‌జడ్‌లో ఏపికి వెసులుబాటు కల్పించాలని కూడా కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. శనివారంనాటి సమావేశంలో జాతీయ పర్స్పెక్టివ్ ప్లాన్‌ను ఆమోదించారు. ప్రధాని మోదీ త్వరలో జరిగే మారిటైం ఇండియా సమ్మిట్‌లో ఈ ప్లాన్‌ను విడుదల చేస్తారని నితిన్ గడ్కరీ తెలిపారు.

chitram కేంద్రమంత్రి అశోక్ గజపతితో అచ్చెన్నాయుడు