జాతీయ వార్తలు

గుజరాత్ స్థానిక ఎన్నికల్లో బిజెపి హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దుచేస్తూ తీసుకున్న నిర్ణయం గుజరాత్ స్థానిక ఎన్నికల్లో ఏ మాత్రం ప్రతికూల ప్రభావం చూపించలేదు. 123 స్థానాల్లో ఏకంగా 107చోట్ల అధికార బిజెపి జయకేతనం ఎగరేసింది. మోదీ ప్రభుత్వం సర్జికల్ దాడి, పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి ప్రజలు ఇచ్చిన తీర్పుగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. రెండు మున్సిపాల్టీలు, ఒక తాలూకా పంచాయతీతోపాటు మెజారిటీ సీట్లు బిజెపి సాధించిందని మంగళవారం ఆయన వెల్లడించారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఖాళీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 123 సీట్లలో 107 బిజెపి గెలుచుకుంది. వచ్చే ఏడాది గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్ట్యా అధికార పార్టీకి స్థానిక ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం గమనార్హం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 16 సీట్లే దక్కాయి. వాపి మున్సిపాల్టీలో బిజెపి ఘన విజయం సాధించింది. 44 సీట్లకు 41చోట్ల అధికార పార్టీ నెగ్గింది. కాంగ్రెస్‌కు మూడంటే మూడు సీట్లు వచ్చాయి.