జాతీయ వార్తలు

హాజీ అలీ దర్గాలో మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 29: లింగ వివక్షపై మహిళలు సాధించిన విజయానికి ప్రతీకగా దాదాపు అయిదేళ్ల తరువాత ముంబయిలోని ప్రతిష్ఠాత్మక హాజీ అలీ దర్గాలోకి మహిళలు మంగళవారం ప్రవేశించారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సహ వ్యవస్థాపకురాలు నూర్జహాన్ ఎస్ నియాజ్ నేతృత్వంలో సుమారు 80మంది మహిళలు వర్లీలో ఉన్న ఈ దర్గాలోకి మధ్యాహ్నం 3గంటలకు ప్రవేశించి ప్రార్థనలు జరిపారు. దర్గాలో మహిళలు సంప్రదాయ చాదర్‌లు, పూవులను సమర్పించి శాంతి నెలకొనాలంటూ ప్రార్థనలు జరిపారు. ముస్లిం మత గురువు సయ్యద్ పీర్ హాజీ అలీ షా బుఖారీ పవిత్ర సమాధి ఉన్న ఈ దర్గాలోకి 2012 జూన్‌లో మహిళలు ప్రవేశించారు. ఆ తరువాత దర్గా ట్రస్టీలు అకస్మాత్తుగా మహిళల ప్రవేశాన్ని నిలిపివేశారు. 2014లో భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ సంస్థ హాజీ అలీ దర్గా ట్రస్ట్‌పై కోర్టుల్లో పిటిషన్ వేసింది. ఆగస్ట్ 26న జస్టిస్ వి ఎం కానడె, జస్టిస్ రేవతి మోహితె ధీరెలతో కూడిన ధర్మాసనం మహిళలకు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ తీర్పును దర్గా ట్రస్ట్ సుప్రీం కోర్టులో సవాలు చేసింది.

చిత్రం..దాదాపు అయిదేళ్ల తరువాత మంగళవారం ముంబయిలోని
ప్రఖ్యాత హాజీ అలీ దర్గాలోకి అడుగుపెడుతున్న భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ కార్యకర్తలు.