జాతీయ వార్తలు

8/11 ముందునుంచీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: పెద్దనోట్ల రద్దు నిర్ణయం అమలులోకి వచ్చిన నాటినుంచి కాకుండా అంతకు ముందునుంచే బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాంకు ఖాతాల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. నవంబర్ 8కి (8/11) ముందు వీరందరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను బహిర్గతం చేస్తే ప్రధాని మోదీ చెబుతున్న పారదర్శకతకు అర్థం వుంటుందని కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ప్రధాని తీసుకున్న నిర్ణయం హర్షణీయమేనని, అయితే నవంబర్ 8నుంచి కాకుండా అంతకుముందునుంచే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాంకు ఖాతాల వివరాలను కోరితే ఓ పెద్ద సమస్యే అవుతుందని మోదీ భావించారని కాంగ్రెస్ ప్రతినిధి అన్నారు. అందుకే చాకచక్యంగా నవంబర్ 8 నుంచి డిసెంబర్ 31 వరకు జరిగే లావాదేవీల వివరాలను జనవరి 1న పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు అందించాలని కోరారని తెలిపారు. ముఖ్యంగా చెక్కుల ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ విభాగాలకు ఎంత మొత్తం వెళ్లిందీ, నవంబర్ 8కి ముందు ఇటు ఎంపీలు, అటు పార్టీ ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేసిందీ, అసలు బిహార్, పశ్చిమ బెంగాల్‌లలో జరిగింది ఏమిటన్నది వెల్లడించాలని డిమాండ్ చేశారు. వీటి వివరాలను వెల్లడిస్తే నిజంగా మోదీకి నల్లధనాన్ని వెలికితీసే విషయంలో చిత్తశుద్ధి ఉందని భావించగలుగుతామని తెలిపారు. కాగా, తాను బిజెపిపై ఎలాంటి ఆరోపణలు చేయడం లేదని, ఆ పార్టీ ఎంపీల ఖాతాల వివరాలను కూడా వెల్లడించడమన్నది పారదర్శకతలో భాగమవుతుందని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. పార్లమెంటులో కొనసాగుతున్న గందరగోళం గురించి ప్రస్తావించిన ఆయన ‘ఇది ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అందించిన సందేశ సారమే’ అని అన్నారు. పార్లమెంటులో గందరగోళం సృష్టించడమన్నది ఆయా పార్టీల వ్యూహాత్మక అంశమేనని, లేనిపక్షంలో సందేశం ప్రజలకు అందదని జైట్లీనే గతంలో చెప్పారని సిబల్ గుర్తుచేశారు. అందుకే తాము జైట్లీ సందేశాన్ని అనుసరిస్తున్నామన్నారు.