జాతీయ వార్తలు

కావాల్సింది అభివృద్ధే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: దేశంలో ప్రజలు అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధిని కోరుకుంటున్నారని, అవినీతి, దుష్పరిపాలనలను సహించటం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశంలో పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో బిజెపి విజయాలే ఇందుకు తార్కాణమని ఆయన అన్నారు. మంగళవారం ఇందుకు సంబంధించి ట్విట్టర్ ఖాతాలో ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈశాన్య భారతం కానీ, పశ్చిమ బెంగాల్ కానీ, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర.. ఎక్కడైనా కానీ బిజెపికి చాలా మంచి ఫలితాలు వచ్చాయి. ప్రజలకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ పోస్ట్ చేశారు. ఈ ప్రజలు అన్ని విధాలా సమగ్రాభివృద్ధిని కోరుకుంటున్నారని ఈ ఫలితాలు చెప్తున్నాయని ఆయన అన్నారు. అస్సాం, మధ్యప్రదేశ్‌లలో ఇటీవల జరిగిన రెండు లోక్‌సభ స్థానాల ఉప ఎన్నికల్లో బిజెపి గెలిచింది. మధ్యప్రదేశ్, గుజరాత్, అరుణాచల్ ప్రదేశ్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బిజెపి గణనీయ స్థానాలు గెల్చుకుంది. మహారాష్ట్ర, గుజరాత్‌లలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా బిజెపి మంచి ఫలితాలను సాధించింది. ‘‘గుజరాత్‌లో బిజెపిపట్ల నిరంతరంగా విశ్వాసం చూపుతున్న ప్రజలకు నేను నమస్కరిస్తున్నా. స్థానిక ఎన్నికల్లో బిజెపికి ఘనవిజయం కట్టబెట్టి ప్రజలు అభివృద్ధి రాజకీయాలకు పట్టం గట్టారు’’ అని మోదీ వ్యాఖ్యానించారు.
విపక్షాలకు కనువిప్పు
మహారాష్ట్ర, గుజరాత్ స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయాలతో విపక్షాలకు కనువిప్పు కలగాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. ‘నల్లధనానికి వ్యతిరేకంగా మోదీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. గాలి ఎటువైపు వీస్తున్నదో విపక్షాలు ఇప్పుడైనా తెలుసుకోవాలి’ అని జవదేకర్ వ్యాఖ్యానించారు.