జాతీయ వార్తలు

పాక్ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన బాజ్వా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావల్పిండి, నవంబర్ 29: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్‌గా జనరల్ కమర్ జావేద్ బాజ్వా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులను త్వరలోనే మెరుగుపరుస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఆర్మీ హాకీ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో రహీల్ షరీఫ్‌నుంచి ఆయన బాధ్యతలను స్వీకరించారు. పదోన్నతి కల్పించడం ద్వారా బాజ్వాను చీఫ్ ఆఫ్ ఆర్మీ స్ట్ఫాగా నియమిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ రోజుతో ఆర్మీ చీఫ్‌గా పదవీ కాలంతో ముగియనున్న రహీల్ షరీఫ్ తాను మరోసారి ఆర్మీ చీఫ్‌గా కొనసాగాలని అనుకోవడం లేదని గత జనవరిలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.