జాతీయ వార్తలు

ప్రధాని సభకు రావాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చి చర్చలో పాల్గొనాలంటూ రాజ్యసభలో ప్రతిపక్ష పట్టుబట్టింది. విపక్ష సభ్యులు పోడియం వద్ద ఇచ్చిన నినాదాలతో రాజ్యసభ మారుమోగింది. రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ఉపాధ్యక్షుడు పిజె కురియన్ సభను అదుపు చేసేందుకు అనేకసార్లు విఫలమయ్యారు. కురియన్ పలుమార్లు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యుడు ఎంఏ ఖాన్‌ను కురియన్ రెండు మూడుసార్లు పేరు పెట్టి హెచ్చరించటం గమనార్హం. ‘ఖాన్ ఎందుకిలా అరుస్తున్నావు. నా మాట విను’ అంటూ ఆయన అప్పీలు చేశారు. మోదీ సభకు రాకుండా చర్చ జరపటం సాధ్యం కాదని బిఎస్‌పి అధినాయకురాలు మాయావతి పునరుద్ఘాటించారు. ప్రధాన మంత్రి సభకు రాకపోతే చర్చ ఎలా సాగుతుందని టిఎంసి సభ్యుడు సుఖేందురాయ్ పలుమార్లు నిలదీశారు. రాజ్యసభ గురువారం ఉదయం సమావేశం కాగానే సుఖేందు రాయ్ లేచి ‘అధికార పక్షంలో సభ్యులు లేరు. కేవలం నలుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. కాబట్టి సభను వాయిదా వేయండి’ అని డిమాండ్ చేశారు. దీనికి సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు సమాధానమిస్తూ తమ పార్టీ సభ్యులంతా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఉన్నారని వివరణ ఇచ్చారు. ఈ దశలో కురియన్ జోక్యం చేసుకుని మీరు వివరణ ఇవ్వవలసిన అవసరం లేదని సూచించారు. ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్యే కురియన్ జీరో అవర్ నిర్వహించేందుకు ప్రయత్నించారు. మంత్రులు సభలో ఉన్నా ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని విపక్షాలను నిలదీశారు. పెద్దనోట్ల రద్దుపై చర్చ కొనసాగిస్తే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మధ్య జోక్యం చేసుకుని సమాధానం ఇస్తారని వెంకయ్య నాయుడు హామీ ఇచ్చినా ప్రతిపక్షం సభ్యులు పట్టించుకోలేదు. ప్రతిపక్షానికి ధైర్యముంటే చర్చ కొనసాగించాలని మంత్రి సవాల్ చేశారు. ఈ దశలో కురియన్ సభను పనె్నండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే చైర్మన్ హమీద్ అన్సారీ ప్రశ్నోత్తరాల కార్యక్రమం నిర్వహించేందుకు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. ప్రధాని సభకు ఎందుకు సభకు రావటం లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్‌పటేల్, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు నరేష్ అగర్‌వాల్ చైర్మన్‌ను ప్రశ్నించారు. దీంతో సభలో గొడవ మరింత ముదిరటంతో హమీద్ అన్సారీ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పుడు కేవలం 3 నిమిషాలు మాత్రమే జరిగింది. 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు కూడా పరిస్థితిలోమార్పులేకపోవడంతో సభ వాయిదా పడింది.

రాజ్యసభలో మంగళవారం నాటి దృశ్యం