జాతీయ వార్తలు

నోట్ల రద్దుపై పిటిషన్లను 2న విచారించనున్న సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దుచేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తాజాగా దాఖలయిన రెండు పిటిషన్లను పెండింగ్‌లో ఉన్న ప్రజాప్రయోజన వ్యాజ్యాల (పిల్)తో కలిపి డిసెంబర్ 2న విచారించడానికి సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. బ్యాంకుల మాదిరిగా పాతనోట్ల మార్పిడిని కొనసాగించడానికి అనుమతించాలని కేరళకు చెందిన 14 సహకార బ్యాంక్‌లు ఒక పిటిషన్‌లో కోరగా, వంద రూపాయలకు పైబడి విలువ కలిగిన నోట్లన్నిటినీ రద్దు చేయాలని కోరుతూ న్యాయవాది కూడా అయిన బిజెపి నాయకుడొకరు మరో పిటిషన్‌లో కోరారు. ఈ రోజు అత్యవసరంగా విచారణకు వచ్చిన ఈ రెండు పిటిషన్లను డిసెంబర్ 2న విచారణకు రానున్న మిగతా పిటిషన్లతో కలిపి విచారించడానికి ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని బెంచ్ నిర్ణయించింది. ఈ అంశంపై దేశంలోని మిగతా కోర్టుల్లో దాఖలయిన పిటిషన్లన్నిటినీ ఏదయినా ఒక హైకోర్టుకు లేదా సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ కేంద్రం దాఖలు చేసుకున్న పిటిషన్ కూడా వాటిలో ఉంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులతో సమానంగా నగదు లావాదేవీలు జరపడానికి కోర్టు అనుమతించాలని సహకార బ్యాంకులు తమ పిటిషన్‌లో కోరాయి. తాము ఆర్‌బిఐ గైడ్‌లైన్స్ ప్రకారం పని చేస్తున్నప్పటికీ కేంద్రం చర్య జిల్లా సహకార బ్యాంకుల్లో పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతించడం లేదని, ఇది వివక్షేనని సహకార బ్యాంకులు తమ పిటిషన్లలో పేర్కొన్నాయి. అలాగే పాతనోట్ల మార్పిడికి ప్రైవేట్ బ్యాంకులను అనుమతిస్తూ, జిల్లా సహకార బ్యాంకులను అనుమతించకపోవడం వివక్షాపూరిత చర్యేనని కూడా ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, అవినీతిని అంతం చేయడానికి, నల్లధనం తయారు కాకుండా ఉండడానికి, ఉగ్రవాదం, తీవ్రవాదం, నక్సలిజం జూదం, స్మగ్లింగ్, మనీ లాండరింగ్ లాంటి కార్యకలాపాలను అదుపు చేయడానికి వంద రూపాయలకు పైబడిన నోట్లన్నిటినీ రద్దు చేయడం అవసరమని ఢిల్లీ బిజెపి అధికార ప్రతినిధి, సుప్రీంకోర్టు అడ్వకేట్ కూడా అయిన అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ తన పిటిషన్‌లో కోరారు.