జాతీయ వార్తలు

ఉగ్ర పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము, నవంబర్ 29: జమ్ములో మంగళవారం జరిగిన సాయుధ ఉగ్రవాదులు రెండో చోట్ల జరిపిన దాడుల్లో ఓ మేజర్ సహా ఏడుగురు జవాన్లు మరణించారు. బిఎస్‌ఎఫ్ డిఐజితో పాటు ఎనిమిది మంది జవాన్లు గాయపడ్డారు. అనంతరం జరిగిన ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదుల్ని జవాన్లు మట్టుబెట్టారు. జమ్ములోని సైనిక ప్రధాన కార్యాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నగ్రోటా ప్రాంతంలోని సైనిక శిబిరంపై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు నేటి ఉదయం కాల్పులకు తెగబడ్డారు. దాంతో అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరుపడంతో కొన్ని గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో ఇద్దరు అధికారులు సహా ఏడుగురు సైనికులు మరణించారు. 12మంది సైనికులు, ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు చిన్నారుల్ని మిలిటెంట్లు బందీలుగా చేజిక్కించుకున్నారు. అనంతరం వ్యూహాత్మకంగా దాడులు జరిపిన బిఎస్‌ఎఫ్ జవాన్లు బందీల్ని రక్షించి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారని సైనిక ప్రతినిధి ఒకరు తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దును ఆనుకుని ఉన్న సాంబ సెక్టార్‌లోని రామ్‌గఢ్ ప్రాంతంలో కొన్ని గంటల పాటు జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని జవాన్లు హతమార్చారు. అనంతరం పాక్ దళాలు తీవ్రస్థాయిలో ఎలాంటి కవ్వింపు లేకుండా కాల్పులకు ఒడిగట్టాయి. ఈ ఘటనలో బిఎస్‌ఎఫ్ డిఐజి సహా నలుగురు జవాన్లు గాయపడ్డారు. పాకిస్తాన్ సైనికాధినేతగా జనరల్ ఖమర్ జావెద్ బజ్వా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజునే జమ్ములో ఈ రెండు ఘటనలు జరగడం గమనార్హం. నగ్రోటా సంఘటనకు సంబంధించిన వివరాలను సైనిక ప్రతినిధి అందించారు. పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధ మిలిటెంట్లు సైనిక శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని భారీ కాల్పులకు ఒడిగట్టారని చెప్పారు. సెంట్రీలపై కాల్పులు జరుపుతూ, గ్రెనేడ్లు విసురతూ మిలిటెంట్లు అధికారుల మెస్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించారని, ఒక అధికారిని, ముగ్గురు సైనికుల్ని కాల్చిచంపారని చెప్పారు. అనంతరం వీరు రెండు భవనాల్లోకి ప్రవేశించారని అక్కడ ఉన్న అధికారులు, పలువురిని బందీలుగా చేజిక్కించుకున్నారని చెప్పారు. పరిస్థితి తీవ్రతను గుర్తించిన జవాన్లు వ్యూహాత్మకంగా దాడి చేసి మిలిటెంట్లను హతమార్చారని, బందీలందరినీ సురక్షితంగా విడిపించారని చెప్పారు. ఈ ప్రయత్నంలోనే మరో ఇద్దరు సైనికులు, మరో అధికారి కూడా మరణించారని సైనిక ప్రతినిధి వివరించారు. ఎదురు కాల్పుల్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని..ఆ ప్రాంతంలో విస్తృత స్థాయిలో గాలింపుచర్యలూ చేపట్టామని అన్నారు.

చిత్రాలు.. నగ్రోటా ఆర్మీ క్యాంపుపై విరుచుకుపడిన ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఎదురు కాల్పులు జరుపుతున్న సైనికులు. భారీగా తరలివస్తున్న భద్రతా బలగాలు