జాతీయ వార్తలు

సవరణ బిల్లుకు ఓకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: విపక్షాల నినాదాలు, గందరగోళ పరిస్థితుల మధ్య ఆదాయం పన్ను సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండా లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిపాజిట్ అయ్యే నల్లధనంపై 50శాతం పన్ను విధించడానికి, అలాగే మరో పాతిక శాతాన్ని నాలుగేళ్ల పాటు ప్రభుత్వం వద్దే ఉంచుకోవడానికి, మిగిలిన పాతిక శాతం మొత్తానే్న తిరిగి తీసుకోవడానికి బిల్లు వీలు కల్పిస్తోంది. అలాగే గడువు తీరినా నల్లధనాన్ని వెల్లడించని వారిపై దాదాపు 85శాతం పన్ను విధించేందుకూ ఈ సవరణ బిల్లు అవకాశం కల్పిస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నియంతగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఇచ్చిన నినాదాలతో పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. ‘ప్రధాని సభకు రారు. నోట్ల రద్దుపై చర్చ ముందుకు సాగనీయరు.వాయిదా తీర్మానంపై చర్చకు అంగీకరించకుండా నియంతగా వ్యవహరిస్తున్నా’రంటూ ప్రతిపక్షం సభ్యులు గందరగోళం సృష్టించారు. అయితే అధికార పక్షం మాత్రం ఇదేది పట్టించుకోకుండా ప్రతిపక్షం సభ్యుల గొడవ, గందరగోళం మధ్య నల్లకుబేరులకు మరో అవకాశం ఇచ్చేందుకు తెచ్చిన ఆదాయపన్ను సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తీసుకుంది. లోక్‌సభలోని ప్రతిపక్ష సభ్యులు పోడియంను చుట్టుముట్టి పెద్దగా నినాదాలు చేస్తున్నా ఆదాయపన్ను సవరణ చట్టం బిల్లును చర్చకు చేపట్టి గందరగోళంలో చర్చ సాధ్యం కావటం లేదంటూ ఏకంగా సభ ఆమోదం పొందింది. ఎన్‌డిఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు ప్రతిపక్షం తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు. ఉభయ సభలు రెండు సార్లు వాయిదా పడినా పరిస్థితి అదుపులోకి రావటంతో మధ్యాహ్నం 2 గంటల తరువాత కొంతసేపుజరిగిన సభలు గురువారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఉదయం సమావేశం కాగానే కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే లేచి ప్రభుత్వం సోమవారం ప్రతిపాదించిన ఆదాయ పన్ను చట్టం సవరణ బిల్లు గురించి ప్రస్తావించారు. బిల్లుపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని చెబుతుండగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇదేది పట్టించుకోకుండా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి తీవ్ర అభ్యంతరం తెలిపిన ప్రతిపక్షం పోడియం వద్దకు వచ్చి గోడవ చేసింది. నరేంద్ర మోదీ, ఎన్‌డిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు ఇవ్వటంతో లోక్‌సభ దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు పోడియం చుట్టూచేరి నినాదాలు ఇచ్చారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ గందరగోళం మధ్యే అధికార పత్రాలను సభకు సమర్పించేశారు. బిల్లుపై కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్, టిఎంసి సభ్యుడు ప్రొఫెసర్ సౌగత్ రాయ్ తదితరులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. ప్రభుత్వం మోసపూరిత పద్దతిలో సవరణ బిల్లును ప్రతిపాదించిందని ధ్వజమెత్తారు.
తాను ప్రతిపాదించిన సవరణలకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించవలసి ఉందని, ఇది లేకుండా ఆదాయం పన్ను చట్టం సవరణ బిల్లుపై చర్చ జరిపేందుకు వీలు లేదని వేణుగోపాల్ గట్టిగా వాదించారు. ఇది అత్యంత ముఖ్యమైన బిల్లు కాబట్టి ఇప్పుడే చర్చ జరిపి ఆ వెంటనే ఆమోదించటం సాధ్యం కాదని సౌగత్ రాయ్ స్పష్టం చేశారు. అధికార పక్షం ఇదే పట్టించుకోలేలేదు. సభలో చర్చ జరిపేందుకు అవకాశం లేదు కాబట్టి ఆదాయం పన్ను చట్టం సవరణ బిల్లును చర్చ లేకుండా మూజువాణీ ఓటుతో ఆమోదించాలని కోరారు. స్పీకర్ ప్రతిపక్ష సభ్యుల గొడవ, గందరగోళం మధ్యనే ఆదాయం పన్ను చట్టం సవరణ బిల్లుపై ఓటింగ్ జరుపగా మూజువాణీ ఓటుతో దానిని ఆమోదించారు.

బిల్లులోని ముఖ్యాంశాలు
నల్లధనంపై 50శాతం పన్ను
పాతిక శాతం నాలుగేళ్ల పాటు డిపాజిట్
పాతిక శాతమే వెనక్కి..
గడువు దాటినా వెల్లడించకపోతే..
దాదాపు 85శాతం పన్ను వడ్డన