జాతీయ వార్తలు

బహుళత్వం, సహనమే నాగరికతకు గీటురాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: భారత దేశ నాగరికతకు బహుళత్వం, సహనశీలతలే ప్రధాన గీటురాళ్లని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఉద్ఘాటించారు. మతపరమైన ఉద్రిక్తతల విషయంలో ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు అర్జున్ సింగ్ స్మారకార్థం శనివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రణబ్ ఈ విజ్ఞప్తి చేశారు. ప్రజ్వామ్యమంటే కేవలం అంకెల గారడీ కాదని, సమాజంలోని విభిన్న వర్గాల ప్రజల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడమే అసలు సిసలైన ప్రజాస్వామ్యని ఆయన ఉద్బోధించారు. బహుళత్వ ప్రజాస్వామ్య వ్యవస్థను కలిగివున్న భారత్ లాంటి దేశంలో ప్రతి ఒక్కరూ పరస్పర భిన్నమైన అభిప్రాయాలను గౌరవిస్తూ, విలువలను, పరమత సహనాన్ని పాటించడం ఎంతో ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం ఢిల్లీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్టప్రతి ప్రణబ్, ఎఐసిసి అధినేత్రి సోనియా, మాజీ ప్రధాని మన్మోహన్ తదితరులు