జాతీయ వార్తలు

మీ లెక్కలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 29: బిజెపి పార్లమెంటు సభ్యులందరు తమ బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను అందజేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. మంగళవారం జరిగిన పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు చేసిన నవంబర్ 8నుంచి డిసెంబర్ 31 తేదీ వరకు తమ ఖాతాల లావాదేవీల పూర్తి వివరాలను అందజేయాలన్నారు. నల్లధనం, అవినీతిని అదుపు చేసేందుకు తాను ఎంత దూరమైనా వెళ్తానని సూచించేందుకే మోదీ ఈ రకమైన ఆదేశాలిచ్చినట్లు భావిస్తున్నారు. తమ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు నోట్ల రద్దు నిర్ణయం తరువాత ఎలాంటి అక్రమాలకు, అవకతవకలకు పాల్పడలేదనే సందేశం పంపించాలన్నదే మోదీ ఆలోచన అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పెద్దనోట్ల రద్దు గురించి ముందస్తు సమాచారాన్ని తమ ఎంపిలు, ఇతరులకు మోదీ లీక్ చేశారని విపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎంపిలతో పాటు ఆయా రాష్ట్రాలలోని పార్టీ శాసన సభ్యులు కూడా తమ బ్యాంకు ఖాతాల వివరాలను అధ్యక్షుడు అమిత్ షాకు అందజేయవలసి ఉంటుంది. దీంతో పాటు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు డెబిట్, క్రెడిట్ కార్డులు, సాఫ్ట్‌మనీ ఉపయోగం గురించి అవగాహన కల్పించాలని ఎంపిలకు సూచించారు. పార్టీ ఎంపిలంతా వారాంతాలలో తమ నియోజకవర్గాలకు వెళ్లి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కాష్ లెస్ లావాదేవీలు చేయటం గురించి నేర్పించవలసి ఉంటుంది. పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఇక మీదట నగదుతో ఆహార పదార్థాలు, టీ, కాఫీ కొనేందుకు వీలుండదు. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌ను వచ్చే వారం నుండి క్యాష్ లెస్ కేంద్రంగా మారుస్తున్నారు. ఎంపిలు, పత్రికా విలేకరులు ఇక మీదట సెంట్రల్ హాల్‌లో తమ క్రెడిట్, డెబిట్ కార్డులతో మాత్రమే చెల్లింపులు చేయవలసి ఉంటుంది. నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా బిజెపి ఎంపిలకు వివరించటం గమనార్హం.
ప్రజలు మనతోనే ఉన్నారు
పెద్ద నోట్ల రద్దు వలన పార్టీకి లాభం కలుగుతోంది తప్ప నష్టం కలగదని నరేంద్ర మోదీ పార్టీ ఎంపిలకు చెప్పారు. మహారాష్ట్ర, గుజరాత్ మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఘన విజయం గురించి మాట్లాడుతూ పెద్దనోట్ల రద్దుకు దేశ ప్రజల మద్దతు ఉన్నదనేందుకు ఇంతకంటే పెద్ద నిదర్శనం కావాలా? అని మోదీ ప్రశ్నించారు. ఆదాయం పన్ను చట్టాన్ని సవరించటం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, మరుగుదోడ్లు,విద్యాలయాల నిర్మాణం, పారిశ్రుద్ద కార్యక్రమాలకు ఉపయోగిస్తామని మోదీ వారితో చెప్పారు.

చిత్రం..బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు షా, మంత్రులు