జాతీయ వార్తలు

పోలవరానికి నాబార్డ్ నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబరు 1: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఆర్థిక శాఖ నుంచి 2,981 కోట్ల నిధులు మంజూరయ్యాయని కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖకు ఆర్థికశాఖ సమాచారం పంపించినట్టు తెలిపారు. నాబార్డ్‌నుంచి ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు విడుదల చేయాలని ఆర్థికశాఖ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. గురువారం సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ, మూడు రోజుల్లో పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదలవుతాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు 2014 నుంచి వ్యయం చేసిన నిధులు రూ.1981 కోట్లు, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా జరిగే పనులకోసం మరో రూ.1000 కోట్లు మంజూరు చేస్తుందని చెప్పారు. తాజా లెక్కలతో కూడిన నివేదికను సమర్పించాల్సిందిగా కేంద్రం కోరినట్టు తెలిపారు. తద్వారా పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదలకు నాబార్డ్‌కు పూర్తి ఆదేశాలు ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వేగాన్ని బట్టి భవిష్యత్తులో విడతల వారీగా నిధులు మంజూరవుతాయన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రెట్టింపు అయిందని ఆయన వెల్లడించారు. ఆ విధంగానే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ 2013 ఏడాది తర్వాత మూడురెట్లకు పైగా నిధులు ఇవ్వాల్సివుందన్నారు. రెండు మూడు నెలల్లో ప్రస్తుత ధరలతో ప్రాజెక్టు వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తివుతాయన్నారు.